Andhra King Taluka Teaser: ఏం బతుకులురా మీవి.. ఛీఛీ.. ప్రతి ఫ్యాన్ కథ
ABN , Publish Date - Oct 12 , 2025 | 05:25 PM
అభిమాని అనేవాడు లేకపోతే హీరోలు లేరు. కానీ, అలాంటి అభిమానులు ఉన్నారని హీరోలకు తెలియదు.
Andhra King Taluka Teaser: అభిమాని అనేవాడు లేకపోతే హీరోలు లేరు. కానీ, అలాంటి అభిమానులు ఉన్నారని హీరోలకు తెలియదు. ఇది నమ్మదగ్గ నిజం. హీరోల కోసం పాలాభిషేకాలు, పూలాభిషేకాలు, రక్తాభిషేకాలు చేసే ఫ్యాన్స్ ఉన్నారు. కానీ, వారెవ్వరూ హీరోకు తెలియదు. వారి ఇంట్లో కష్టం వస్తే హీరో వచ్చి ఆదుకోడు. కానీ, ఇవేమి పట్టించుకోకుండా ఇంట్లో తల్లిదండ్రులకంటే ఎక్కువ హీరోను అభిమానిస్తారు అభిమానులు. అలాంటివారి కథనే ఆంధ్రా కింగ్ తాలూకా. రామ్ పోతినేని హీరోగా తెరకెక్కిన ఈ చిత్రానికి మహేష్ బాబు పి దర్శకత్వం వహించాడు.
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంలో రామ్ సరసన భాగ్యశ్రీ బోర్సే నటించగా కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర కీలక పాత్రలో నటించాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. సాగర్ కు వాళ్ల నాన్న చిన్నతనం నుంచి సినిమాలు బాగా చూపించి థియేటర్ కు అలవాటు చేస్తాడు.
ఇక ఆంధ్ర కింగ్ సూర్యకు సాగర్ వీరాభిమాని. ఆయన సినిమా ప్లాప్ అని ఎవరైనా అంటే వారిపై యుద్దానికి కూడా వెళ్తాడు. అలా కాలేజ్ లో వేరే హీరో ఫ్యాన్స్ తో అతనికి గొడవలు కూడా అవుతాయి. ఆ మితిమీరిన అభిమానం వలన సాగర్ ఎలాంటి కష్టాలను ఎదుర్కున్నాడు. సాగర్ ప్రేమించింన అమ్మాయి ఎవరు.. ? చివరకి సాగర్.. ఆంధ్రా కింగ్ సూర్యను కలిశాడా.. ? లేదా.. ? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
టీజర్ లో రామ్ చాలా కొత్తగా కనిపించాడు. కథ కూడా చూచాయిగా చెప్పారు కానీ, ట్విస్ట్ లు ఉన్నాయని చివర్లో డైలాగ్ ను బట్టి తెలుస్తోంది. ఫ్యానూ.. ఫ్యానూ అని ఓ నువ్వు గుడ్డలు చింపేసుకోవడమే కానీ, నువ్వు ఒకడివి ఉన్నవని కూడా ఆ హీరోకు తెలియదు అనే డైలాగ్ హీరో కోసం ప్రాణం పెట్టే ప్రతి అభిమానికి వర్తిస్తుంది. ఈ ఒక్క డైలాగ్ తోనే సినిమాపై హైప్ క్రియేట్ చేశాడు డైరెక్టర్. ఇక వివేక్ అండ్ మార్విన్ మ్యూజిక్ చాలా కొత్తగా అనిపించింది. మొత్తానికి టీజర్ తోనే ఫ్యాన్స్ ను మెప్పించాడు డైరెక్టర్. నవంబర్ 28 న ఆంధ్రా కింగ్ తాలూకా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో రామ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.
Oka Manchi Prema Katha: జనాల్లో ఆలోచనను రేకెత్తించేలా
Srikant Ayyangar: శ్రీకాంత్ అయ్యంగార్‌పై ‘మా’లో ఫిర్యాదు..