Srikant Ayyangar: శ్రీకాంత్‌ అయ్యంగార్‌పై ‘మా’లో ఫిర్యాదు..

ABN , Publish Date - Oct 12 , 2025 | 03:03 PM

మహాత్మ గాంధీపై నటుడు శ్రీకాంత్‌ అయ్యంగార్‌ చేసిన వ్యాఖ్యలపై ‘మావీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌’కు ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌. శ

మహాత్మ గాంధీపై (Gandhi) నటుడు శ్రీకాంత్‌ అయ్యంగార్‌ (Srikant Ayyangar) చేసిన వ్యాఖ్యలపై ‘మావీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌’కు ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌(Balmuri venkat). శనివారం సైబర్‌ క్రైమ్‌లో శ్రీకాంత్‌ అయ్యంగార్‌పై ఫిర్యాదు చేసిన ఆయన పలు వ్యాఖ్యలు చేశారు.

‘మా అసోసియేషన్‌లో సభ్యుడిగా ఉన్న శ్రీకాంత్‌ అయ్యంగార్‌ ఉద్దేశపూర్వకంగానే సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నాడు. అతని వ్యాఖ్యలకు ఎంతోమంది మనోభావాలు దెబ్బ తింటున్నాయి. ఇటువంటి వ్యాఖ్యలతో ప్రజలు గ్రూపులుగా విడిపోయి కొట్టుకునే పరిస్థితి వస్తుంది. జాతిపిత పైన ఇటువంటి వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరాం. ‘మా’ అసోసియేషన్‌ శ్రీకాంత్‌ అయ్యంగార్‌ పై చర్యలు తీసుకుంటామన్నారు. ఈ విషయంపై సినీ పెద్దలు కూడా స్పందించాలి. ఈ వ్యక్తిపై చర్యలు తీసుకోవాలి.. లేదంటే మేము యాంటీ బయోటిక్‌ కావల్సి వస్తుంది’ అని అన్నారు.

మా అసోసియేషన్‌ జనరల్‌ సెక్రటరీ శివ బాలాజీ మాట్లాడుతూ ‘ఫ్రీడం ఆఫ్‌ స్పీచ్‌ ఈరోజుల్లో ప్యాషన్‌ అయ్యింది. మాకు క్రమశిక్షణ కమిటీ ఉంది.. చర్చించి నిర్ణయం తీసుకుంటాం. మా కమిటీ మీటింగ్‌ పెట్టి.. త్వరలోనే చర్యలు తీసుకుంటాం’ అని అన్నారు.

Updated Date - Oct 12 , 2025 | 03:05 PM