Harihara Veeramallu: హరి హర వీరమల్లు.. నుంచి హాటెస్ట్ తార పాట వచ్చేస్తోంది
ABN, Publish Date - May 26 , 2025 | 09:13 AM
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చారిత్రాత్మక యోధుడిగా కనువిందు చేయనున్న ప్రతిష్టాత్మక చిత్రం 'హరి హర వీరమల్లు'
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) చారిత్రాత్మక యోధుడిగా కనువిందు చేయనున్న ప్రతిష్టాత్మక చిత్రం 'హరి హర వీరమల్లు' (Hari Hara Veera Mallu). ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం (A.M. Ratnam) సమర్పణలో ఎ. దయాకర్ రావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి (M.M. Keeravani) సంగీతం అందిస్తున్నారు. నిధి అగర్వాల్ (Nidhhi Agerwal) కథానాయికగా నటిస్తుండగా బాబీ డియోల్ (Bobby Deol) ప్రతినియకుడిగా నస్తున్నారు. జూన్ 12న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానున్న ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి.
సినిమా రిలీజ్‌దగ్గర పడుతున్న నేపథ్యంలో మేకర్స్ ప్రచార కార్యక్రమాల్లో వేగం పెంచారు. ఈక్రమంలో ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన మూడు పాటలు ఒక దాన్ని మించి మరోటి మంచి స్పందనను రాబ్టుకోగా తాజాగా మరో పాటను విడుదల చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. ఈ మేరకు సోమవారం ఉదయం ఈ పాటకు సంబంధించిన అప్డేట్ ఇచ్చారు. తార తార (#TaaraTaara )అంటూ సాగే హాట్ సాంగ్‌ను బుధవారం మే28న ఉదయం విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ పాటను కథానాయిక నిధి ఆగర్వాల్ (Nidhhi Agerwal) పై చిత్రీకరించగా పాటలో అందాల విందు భారీగానే ఉండనున్నట్లు మేకర్స్ ఇచ్చిన హింట్‌తో తెలుస్తోంది.