సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Sujeeth: ఆ షాట్‌ ఓజీలో పెట్టా.. ఎక్కడికో వెళ్లిపోయింది..

ABN, Publish Date - Dec 21 , 2025 | 06:25 PM

తాజాగా సుజీత్ ఓ ‘రౌండ్‌ టేబుల్‌’ సమావేశంలో పాల్గొన్నారు. సినిమా ఇండస్ట్రీలో తన జర్నీని గుర్తుచేసుకుంటూ ఆసక్తికర విషయం పంచుకున్నారు.

Sujeeth - OG

లఘు చిత్రాల ద్వారా ప్రతిభను బయటపెట్టి సినిమా డైరెక్టర్‌గా మారిన వారిలో సుజీత్‌ (sujeeth) ఒకరు. దాదాపు 40 షార్ట్స్‌ ఫిల్మ్స్‌ చేసిన తర్వాత ఆయనకు ‘రన్‌ రాజా రన్‌’ సినిమా అవకాశం వచ్చింది. ఆ తర్వాత అగ్ర హీరోలు ప్రభాస్‌తో ‘సాహో’, పవన్‌కల్యాణ్‌తో ‘ఓజీ’ (OG) చిత్రాలు తీసి దర్శకుడిగా నిరూపించుకున్నారు. తాజాగా ఆయన ఓ ‘రౌండ్‌ టేబుల్‌’ సమావేశంలో పాల్గొన్నారు. సినిమా ఇండస్ట్రీలో తన జర్నీని గుర్తుచేసుకుంటూ ఆసక్తికర విషయం పంచుకున్నారు.

2009లో ఆయన తీసిన ఓ షార్ట్‌ఫిల్మ్‌లోని షాట్‌నే.. ‘ఓజీ’లో పెట్టానని  చెప్పారు. ఆ లఘు చిత్రంలోని షాట్‌కు ఇప్పటికీ తక్కువ వ్యూసే ఉన్నాయని, అదే షాట్‌ సినిమాలో చూసి అంతా వావ్‌ అన్నారంటూ ఆనందం వ్యక్తం చేశారు. స్టార్‌ యాక్టర్స్‌ పని చేయడం వల్ల కలిగే బెనిఫిట్‌ అది అని ఆయన అన్నారు. అసలు ఏ గుర్తింపు లేని ఆ   షాట్‌ స్టార్‌తో తెరకెక్కించడం వల్ల దాని స్థాయి ఎక్కడికో వెళ్లిపోయిందన్నారు. ‘ఓజీ’ సినిమా షూటింగ్‌కు ముందే డెమో షూట్‌ చేశాను. ఆ ఫుటేజీ నిడివి 2:35 గంటలు. డెమో కారణంగానే మూవీ షూటింగ్‌ త్వరగా పూర్తి చేయగలిగాను’ అన్నారు. సుజీత్‌. ఇటీవల సుజీత్‌ పవర్‌స్టార్‌ పవన్‌కల్యాన్‌ ల్యాండ్‌ రోవర్‌ డిఫెండర్‌ కార్‌ను బహుమతిగా ఇచ్చిన సంగతి తెలిసిందే. దాని గురించి ఆయన ఆనందం వ్యక్తం చేశారు. సెప్టెంబరులో  ప్రేక్షకుల ముందుకొచ్చిన ఓజీ ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవుతోంది. సుజీత్‌ చెప్పిన ఆ షాట్‌ మరేదో కాదు.. నీటిలో హీరో అడుగేడయం, ఆ రిఫ్లెక్షన్‌ను హైలైట్‌ చేస్తూ నటుడి వైపు కెమెరాను ఫోకస్‌ చేయడం. ఆ సీన్‌ షార్ట్‌ ఫిల్మ్‌లో ఎలా ఉంది.. సినిమాలో ఎలా ఉంది అన్నది ఈ వీడియోలో చూడొచ్చు.  

Updated Date - Dec 21 , 2025 | 06:28 PM