సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

NTR: దేవర 2 లేనట్టేనా..

ABN, Publish Date - Nov 24 , 2025 | 06:28 PM

ఈ మధ్యకాలంలో సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తున్న విషయం తెల్సిందే. కథ ఉన్నా లేకున్నా సీక్వెల్ అని ప్రకటించడం ఫ్యాషన్ గా మారిపోయింది.

NTR

NTR: ఈ మధ్యకాలంలో సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తున్న విషయం తెల్సిందే. కథ ఉన్నా లేకున్నా సీక్వెల్ అని ప్రకటించడం ఫ్యాషన్ గా మారిపోయింది. ఇక టాలీవుడ్ ఏ సీక్వెల్ కోసం ఎదురుచూస్తున్నారు అంటే.. ఎన్టీఆర్ (NTR) ఫ్యాన్స్ కచ్చితంగా దేవర 2 అని చెప్పుకొచ్చేస్తారు. కొరటాల శివ(Koratala Siva) దర్శకత్వంలో ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా తెరకెక్కిన దేవర(Devara) సినిమా గతేడాది రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. రాజమౌళితో సినిమా తీసాకా ప్లాప్ అందుకోకుండా హిట్ అందుకున్న ఏకైక హీరోగా ఎన్టీఆర్ నిలిచాడు.

ఇక ఈ సినిమాలో తండ్రీకొడుకులుగా నటించి మెప్పించిన ఎన్టీఆర్ నటన కొంత ట్రోలింగ్ కు గురైంది. ఏది తెలియాలన్నా దేవర కథ తెలియాలి అని శివ కొరటాల.. నొక్కి నొక్కి చెప్పడంతో అసలు దేవర కథ ఏంటి అని తెలుసుకోవడానికి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆ కథను దేవర 2 లో చెప్తానని చెప్పడంతో ఎప్పుడెప్పుడు దేవర 2 రిలీజ్ అవుతుందా అని చూస్తున్నారు.

కొరటాల కూడా దేవర 2 పట్టాలెక్కుతోంది అని చెప్పుకొచ్చాడు. కానీ, ఎన్టీఆర్ మాత్రం దేవర 2 మీద ఆసక్తి చూపించడం లేదని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం డ్రాగన్ సినిమాతో బిజీగా ఉన్న ఎన్టీఆర్.. దేవర 2 ఇక వద్దు అనుకుంటున్నాడని టాక్. ఈ లెక్కన ఇక దేవర 2 లేనట్టే అని చెప్పొచ్చు. మరి ఇందులో ఎంతవరకు నిజముంది అనేది తెలియాల్సి ఉంది.

Updated Date - Nov 24 , 2025 | 06:30 PM