The RajaSaab Trailer 2.0: ఇది కదా కావాల్సింది.. ట్రైలర్ అదిరిపోయింది రాజాసాబ్
ABN, Publish Date - Dec 29 , 2025 | 03:17 PM
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా మారుతీ (Maruthi) దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ది రాజాసాబ్ (The Rajasaab).
The RajaSaab Trailer 2.0: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా మారుతీ (Maruthi) దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ది రాజాసాబ్ (The Rajasaab). పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ నటిస్తుండగా.. సంజయ్ దత్, బొమన్ ఇరానీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సంక్రాంతి కానుకగా ది రాజాసాబ్ జనవరి 9 న రిలీజ్ కానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపేట్టిన మేకర్స్ తాజాగా ఈ సినిమా రిలీజ్ ట్రైలర్ ని రిలీజ్ చేశారు.
మొదటి ట్రైలర్ లో ప్రభాస్ కామెడీని చూపించిన మారుతీ ఈ ట్రైలర్ అసలుసిసలైన కథను చూపించాడు. డార్లింగ్ నవ్వించడమే కాదు.. భయపెట్టగలడు అని కూడా ఈ ట్రైలర్ లో చూపించారు. మొదటి నుంచి చెప్పినట్లే.. తాత- మనవడిలా మధ్య జరిగే యుద్ధమే ఈ సినిమా. ఇక తాను సంపాదించిన ఆస్తి ఎవరికి దగ్గకూడదు అని చనిపోయాకా కూడా ఆత్మగా తిరుగుతూ.. బంగ్లాలోకి ఎవరైనా వస్తే చంపేసే తాత. ఇక బామ్మ దగ్గర రాజాసాబ్ లా పెరిగిన మనవడు. బామ్మ ఆరోగ్యం క్షీణించడంతో.. ఆమెను కాపాడుకోవడానికి ఎంతకైనా తెగించే రాజాసాబ్.. చివరకు తాతను ఎదిరించి అయినా ఆ బంగ్లాను సొంతం చేసుకొని.. ఆమెను కాపాడాలనుకుంటాడు. ఇక సొంత మనవడు అయినా కూడా ఆత్మగా ఉన్న తాత .. అతడిని కూడా చంపాలని ప్రయత్నిస్తాడు. చివరకు వీరిద్దరిలో ఎవరు గెలిచారు.. ? బామ్మను రాజాసాబ్ కాపాడుకున్నాడా.. ? తాత ఇన్నేళ్ళైనా ఆత్మగా ఎలా ఉండగలిగాడు.. ? చివరకు ఆత్మను రాజాసాబ్ ఏం చేశాడు.. ? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
ఇప్పటివరకు హర్రర్ జానర్ ను ప్రభాస్ ట్రై చేయలేదు. మొదటిసారి రాజాసాబ్లో దెయ్యాలతో యుద్దానికి దిగాడు. ట్రైలర్ మొత్తాన్ని యాక్షన్ తో నింపేశారు. ప్రభాస్ బంగ్లాలోకి అడుగుపెట్టిన దగ్గరనుంచి తాత మాట్లాడడం, డార్లింగ్ ని భయపెట్టాలని చూడడం, మొసలితో ఫైట్ ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ప్రతిసారి ప్రభాస్.. తాతతో సవాలు విసరడం.. ఆస్తి మొత్తం తన బామ్మదే అని చెప్పడంతో.. తాత రాక్షసత్వానికి ఎలాగైనా ముగింపు పలకాలని ప్రభాస్ చేసే ప్రతి ప్రయత్నం ట్రైలర్ లో కనిపిస్తుంది. ఇక చివర్లో అసలు సిసలైన గెటప్.. జోకర్ లుక్ లో డార్లింగ్ అదిరిపోయాడు. తాత లుక్ నుంచి జోకర్ లుక్ వరకు కూడా డార్లింగ్ అదరగొట్టేశాడు. ఇక థమన్ మ్యూజిక్ తో రఫ్ఫాడించేశాడు. విజువల్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. హర్రర్ సినిమాలకు విఎఫ్ఎక్స్ చాలా ప్రధానం. ట్రైలర్ లో చూపించినదాన్ని బట్టి.. కొద్దిగా లేట్ అయినా కూడా మంచి అవుట్ ఫుట్ ని రాబట్టినట్లు తెలుస్తోంది. మొత్తానికి ఇది కదా అసలు సిసలైన ట్రైలర్ అని అనిపించాడు మారుతీ. మరి ది రాజాసాబ్ తో డార్లింగ్ ఎలాంటి రికార్డులు సృష్టిస్తాడో చూడాలి.