Maruthi: సినిమా నచ్చకపోతే.. నా ఇంటికి వచ్చి అడగండి! అడ్రెస్ చెప్పిన మారుతి
ABN, Publish Date - Dec 28 , 2025 | 07:38 AM
ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందిన రాజాసాబ్ ప్రీ రిలీజ్ వేడుకలో దర్శకుడు మారుతి భావోద్వేగంగా మాట్లాడారు.
మారుతి (Maruthi) దర్శకత్వంలో ప్రభాస్ (Prabhas) కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం ‘రాజాసాబ్’ (Rajasaab) అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు ముస్తాబయింది. ఈ నేపథ్యంలో శనివారం హైదరాబాద్‌లో ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ సినిమా కోసం మూడేళ్ల పాటు పడిన కష్టం, ప్రభాస్ ఇచ్చిన సపోర్ట్‌ను గుర్తు చేసుకొని వేదికపై మారుతి భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్నారు.
ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘ఈ సినిమాలో ఒక్క సీన్ ప్రేక్షకులను నిరాశపరిచినా, నా ఇంటి అడ్రెస్ ఇస్తా రండి’ అంటూ సినిమాపై తనకున్న నమ్మకాన్ని చాటుకున్నారు. ప్రభాస్ రేంజ్‌కు తగ్గట్లు ఏదో సినిమా చేశాం అనిపించుకోకుండా, ఒక పెద్ద స్పాన్ ఉన్న హారర్ ఫాంటసీ మూవీగా ‘రాజాసాబ్’ను తీర్చిదిద్దినట్లు చెప్పారు.
నిర్మాత టీజీ విశ్వప్రసాద్ (TG Vishwa Prasad) మాట్లాడుతూ ‘మా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలో బిగ్గెస్ట్ స్టార్‌తో చేసిన బిగ్గెస్ట్ ఫిల్మ్ ఇది. చాలామంది చిన్న సినిమా అనుకున్నారు కానీ, మూడేళ్లు కష్టపడి ‘రాజాసాబ్’ను నిర్మించాం. ఏ ఒక్కరినీ మా చిత్రం నిరాశపరచదు. హారర్ ఫాంటసీ జానర్‌లో రాజా సాబ్ బిగ్గెస్ట్ ఫిల్మ్ అవుతుంది’ అని చెప్పారు. ప్రభాస్ లాంటి స్టార్ నటించిన సినిమాతో టాలీవుడ్‌లో అరంగేట్రం చేయడం గౌరవంగా భావిస్తున్నానని మాళవికా మోహనన్ చెప్పారు. ప్రభాస్‌తో సినిమా చేయడంతో ఓ కల నిజమైనట్లు ఉందని నిధి అగర్వాల్ అన్నారు.