సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

The Raja Saab: రీషూట్ల మీద రీషూట్లు.. హిట్‌ పడుతుందా..

ABN, Publish Date - Aug 10 , 2025 | 05:30 PM

ప్రభాస్‌ (Prabhas) సినిమా అంటే.. ఆకాశమే హద్దు అన్నట్లు అంచనాలు ఉంటాయి. ఆయన సినిమా పోస్టర్‌ రిలీజ్‌ అయితే చాలు హైప్‌ ఎక్కడికో వెళ్లిపోతుంది. ప్రస్తుతం ఆయన నటిస్తున్న 'రాజాసాబ్‌’ (the Raja saab) చిత్రం ఈ డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకురానుంది

The Raja saab


ప్రభాస్‌ (Prabhas) సినిమా అంటే.. ఆకాశమే హద్దు అన్నట్లు అంచనాలు ఉంటాయి. ఆయన సినిమా పోస్టర్‌ రిలీజ్‌ అయితే చాలు హైప్‌ ఎక్కడికో వెళ్లిపోతుంది. ప్రస్తుతం ఆయన నటిస్తున్న 'రాజాసాబ్‌’ (the Raja saab) చిత్రం ఈ డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకురానుంది. మారుతి దర్శకత్వంలో ది బిగ్గెస్ట్‌ హారర్‌ ఫాంటసీ సినిమాగా తెరకెక్కుతోంది. ఇలాంటి కాన్సెప్ట్‌ ఇప్పటి దాకా ఇండియన్‌  స్క్రీన్  మీద రాలేదని దర్శకుడు మారుతి (maruthi) ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘తాతయ్య, నానమ్మ, మనవడి కథను ఇందులో చూపించనున్నాం. ఆన్‌ స్ర్కీన్‌ చూసిన తర్వాత ప్రేక్షకులు తప్పకుండా కనెక్ట్‌ అవుతారు’ అని మారుతి ఎంతో నమ్మకంగా చెప్పారు. అయితే ఈ చిత్రం మొదలై చాలా కాలమైంది. భారీ సెట్లు, వీఎఫ్‌ఎక్స్‌ చాలా కథనే ఉంది. కానీ షూటింగ్‌ మాత్రం ఇంకా ఓ కొలిక్కి రాలేదు.




తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాను రీ షూట్ల మీద రీ షూట్లు చేస్తున్నారట. అవుట్‌పుట్‌లో ఎక్కడా శాటిస్‌ఫేక్షన్‌ లేకపోవడం మళ్లీ మళ్లీ సీన్లు తీస్తున్నారని అందుకే ఈ సినిమా ఇంకా ఓ దారికి రాలేదని తెలిసింది. అలాగే ఈ చిత్రంలో ఓ సన్నివేశం విషయంలో కూడా చిత్ర బృందం డైలామాలో ఉందట. ఇందులో బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు సంజయ్‌ దత్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఓ సన్నివేశంలో సంజయ్‌ దత్‌ భారీ భూతంగా, ప్రభాస్‌ని సాధారణ నరుడిగా కనిపిస్తారట. ఇద్దరి మధ్య పోరాట సన్నివేశంలో సంజయ్‌ దత్‌ తన కన్నా ఆకారంలో చిన్నగా ఉన్న ప్రభాస్‌ను పిడికిలి మధ్యలో పెట్టి నలిపేసే సన్నివేశం ఒకటి ఉందని తెలిసింది. పాన్‌ ఇండియా స్థాయిలో స్టార్‌డమ్‌ ఉన్న ప్రభాస్‌ను అలా చేస్తే అభిమానులు అంగీకరిస్తారా? లేదా అన్నదే ఇప్పుడు మేకర్స్‌ ముందున్న సమస్య. ఇప్పుడు ఆ సీన్‌ ఉంచాలా? వద్దా అనే డైలామాలో మేకర్స్‌ ఉన్నారని సమాచారం. రీషూట్‌ ఎప్పుడూ మంచిదే అంటారు సినీ జనాలు. కానీ ఇక్కడు మారుతి వరుస రీషూట్లు చేస్తుండడటం టీమ్‌కే సినిమా మీద నమ్మకం లేకుండా పోయిందట.


పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ సంస్థ భారీ వ్యయంతో నిర్మిస్తున్న ఈ చిత్రమిది. ఈ మధ్యకాలంలో ఈ బ్యానర్‌లో వచ్చిన ఏ సినిమా కూడా సరిగ్గా ఆడలేదు. ప్రస్తుతం ఈ సంస్థ ఆశలన్నీ రాజాసాబ్‌ పైనే. నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌ కూడా ‘ఈసారి గట్టిగా కొడతాం.. ఇప్పటి దాకా బ్యానర్‌పై ఉన్న ఫెయిల్యూర్‌ టాక్‌ మొత్తం పోతుందని’ పూర్తి విశ్వాసంతో చెబుతున్నారు. అలాగే బడ్జెట్‌ విషయంలో ఎక్కడా వెనుకాడట్లేదు. అయితే మారుతి మాత్రం క్లారిటీ లేక రీషూట్లు మీద రీ షూట్లు చేస్తున్నారని టాక్‌ నడుస్తోంది. మారుతికి ఇది కొత్త జానర్‌ కావడంతో కాస్త తడబడుతున్నాడనే టాక్‌ కూడా ఉంది. ఏదేమైనా ఈ చిత్రాన్ని డిసెంబర్‌ 5న పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల చేయడానికి నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో నిధీ అగర్వాల్‌, మాళవిక మోహనన్‌, రిద్ది కుమార్‌ కథానాయికలు.     

Updated Date - Aug 10 , 2025 | 09:20 PM