Director Anudeep: అయ్యయ్యో.. ఇండస్ట్రీ హిట్ డైరెక్టర్ ను అలా తోసేసారేంటయ్యా
ABN , Publish Date - Jul 04 , 2025 | 02:27 PM
డైరెక్టర్ అనుదీప్ కెవి (Anudeep KV)గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
Director Anudeep: ప్రజలకు హీరోలు, హీరోయిన్లు గుర్తున్నంతగా డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు గుర్తు ఉండరు. ఎందుకంటే వారు ఎక్కువ బయట కనిపించరు కాబట్టి. అయితే సోషల్ మీడియా, యూట్యూబ్ వచ్చాకా.. కొద్దీ కొద్దిగా వారు కూడా ప్రేక్షకులకు పరిచయం అవుతున్నారు. ఇక డైరెక్టర్ అనుదీప్ కెవి (Anudeep KV)గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జాతిరత్నాలు (Jathirathnalu) సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకొని ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్ గా మారాడు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో ఆయన చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.
ముఖ్యంగా సుమ షోకు వచ్చి అనుదీప్ మరింత పేరు తెచ్చుకున్నాడు. ఇక ఈ సినిమా తరువాత ప్రిన్స్ అనే సినిమాతో అనుదీప్ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు కానీ, ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయాడు. ప్రస్తుతం మంచి స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో ఉన్న ఈ కుర్ర డైరెక్టర్ ఈమధ్యకాలంలో వేరొకరి సినిమాల ఫంక్షన్స్ లో బాగా కనిపిస్తున్నాడు. నిన్న రిలీజ్ అయిన హరిహర వీరమల్లు ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో హైలైట్ అంటే అనుదీప్ అనే చెప్పొచ్చు. అంతగా హైలైట్ అవ్వడానికి అనుదీప్ ఏమి చేయలేదు. కానీ, ఇప్పుడు ఈ డైరెక్టర్ గురించి సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.
నిన్న జరిగిన హరిహర వీరమల్లు ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు గెస్ట్ గా అనుదీప్ కూడా వెళ్ళాడు. ట్రైలర్ లాంచ్ అయ్యాక అందరూ ఆనందంగా గెంతులు వేస్తున్న ఫ్యాన్స్ మధ్య నుంచి అనుదీప్ స్టేజిపైకి వెళ్ళడానికి ప్రయత్నించాడు. ఈలోపు అక్కడ ఉన్న పోలీసులు అతనిని తోసేశారు. పైకి వెళ్ళడానికి వీల్లేదని వెనక్కి నెట్టారు. ఆ తరువాత అనుదీప్ తానెవరో చెప్పి.. పైకి వెళ్ళాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయ్యయ్యో ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన డైరెక్టర్ ను ఇలా తోసేసారేంటయ్యా అంటూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. పాపం అనుదీప్ అని మీమ్స్ వేసుకొని ఒక ఆట ఆడుకుంటున్నారు.
Pawan Kalyan: ముగ్గురు ఒకే ఫ్రేములో! కుమారులతో పవన్.. సోషల్ మీడియా బద్దలు