Pawan Kalyan: ముగ్గురు ఒకే ఫ్రేములో! కుమారుల‌తో ప‌వ‌న్.. సోష‌ల్ మీడియా బ‌ద్ద‌లు

ABN , Publish Date - Jul 04 , 2025 | 01:24 PM

అధికారిక కార్య‌క్ర‌మాలు, వ‌రుస షూటింగ్‌లతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ ఈరోజు ఉద‌యం త‌న కుమారులతో క‌లిసి ఉన్న ఫొటో బ‌య‌ట‌కు వ‌చ్చి పెద్ద ర‌చ్చే చేస్తోంది.

pawan kalyan

ఇటీవ‌ల ప‌లు అధికారిక కార్య‌క్ర‌మాలు, వ‌రుస షూటింగ్‌లతో బిజీగా ఉన్న ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఉప ముఖ్య‌మంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఈరోజు శుక్ర‌వారం ఉద‌యం త‌న కుమారులు అకీరా నందన్ (Akira nandan), మార్క్ శంకర్ ప‌వ‌నోవిచ్ (MarkShankar)లతో క‌లిసి ప్ర‌తేక విమానం మంగళగిరిలోని తన నివాసానికి చేరుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటో బ‌య‌ట‌కు రావ‌డంతో ఫ్యాన్స్ వేల సంఖ్య‌లో సోష‌ల్ మీడియాలో పెద్ద సునామీనే సృష్టిస్తున్నారు. వ‌రుస‌ ట్వీటులు, పోస్టుల‌తో నేష‌న‌ల్ వైడ్‌గా ట్రెండ్ చేస్తున్నారు.

pawan.jpg

ప‌వ‌న్‌, అకీరా, మార్క్ శంక‌ర్ ఎప్పుడు బ‌య‌ట‌కు వ‌చ్చినా సింగిల్‌గానే క‌నిపించ‌డం, ఎప్పు చూసినా ఎవ‌రో ఒక‌రు మాత్ర‌మే మీడియా కంట ప‌డ‌డంతో ఫ్యాన్స్ ఎంతోకాలంగా వీరు ముగ్గురు క‌లిసి ఉన్న ఫొటో కోసం ఈగ‌ర్లీ వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు వారి ఆక‌లి తీర్చేలా ఇలాంటి ఫొటో అభిమానుల‌కు చాలా అరుదుగా లభించ‌డంతో వారి ఆనందానికి అవ‌దుల్లేకుండా పోయాయి. దాంతో ఫ్యాన్స్ను ఆపే వారు లేక‌పోవ‌డంతో సామాజిక మాధ్య‌మాల్లో ట్రెండింగ్ చేస్తూ త‌మ అభిమానాన్ని చాటుకుంటున్నారు. మీరూ ఓ లుక్కేయండి.

ఇదిలాఉంటే.. ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టించిన హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు ట్రైల‌ర్ గురువారం విడుద‌లై ప్ర‌పంచ వ్యాప్తంగా మంచి వ్యూస్ రాబ‌ట్ట‌డ‌మే కాక రికార్డులు సాధిస్తుంది. జూలై24న సినిమా థియేట‌ర్ల‌లోకి రానుంది.

Updated Date - Jul 04 , 2025 | 01:24 PM