Mahavatar Narsimha: దుమ్మురేపుతున్న మహావతార్‌ నరసింహ

ABN , Publish Date - Aug 11 , 2025 | 06:31 PM

'మహావతార్ నరసింహ' దెబ్బకు బాక్సాఫీస్ బద్దలై పోతోంది. కలెక్షన్లు కుంభవృష్టిలా కురుస్తున్నాయి. ప్రమోషన్లు గట్టిగా చేయకపోయినా, పబ్లిసిటీకి ఖర్చు పెట్టకపోయినా కేవలం మౌత్ టాక్ తో ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఇండియన్ సినిమా రికార్డులను తిరగరాస్తోంది.

చిన్న సినిమాగా విడుదలైన 'మహావతార్ నరసింహ' (Mahavatar Narsimha) చూస్తుండగానే బాక్సాఫీస్‌ను ఓ రేంజ్‌లో షేక్ చేస్తోంది. అశ్విన్ కుమార్ దర్శకత్వంలో, హోంబలే ఫిల్మ్స్ (Hombale Films) నిర్మాణంలో రూపొందిన ఈ యానిమేటెడ్ చిత్రం 2025లో భారతీయ సినిమా పరిశ్రమలో అతిపెద్ద విజయాల్లో ఒకటిగా నిలిచింది. ఊహించని విధంగా ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటూ రికార్డులను బద్దలు కొడుతూ తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. ఈ సినిమా ఆగస్ట్ 11వ తేదీకి ప్రపంచవ్యాప్తంగా రూ. 210 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది.


ఇక 'మహావతార్ నరసింహ' హిందీ వెర్షన్ విషయానికి వస్తే... ఈ సినిమా 16వ రోజుకు రూ. 100 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించి సంచలనం సృష్టించింది. విదేశాల్లోనూ ఈ మూవీ తన హవాను చూపిస్తోంది. నార్త్ అమెరికాలో కొన్ని రోజులు ఆలస్యంగా రిలీజైనప్పటికీ, కేవలం 10 రోజుల్లోనే వన్ మిలియన్ డాలర్స్ గ్రాస్ మార్క్‌ను అలవోకగా దాటేసింది. మంచి కంటెంట్ ఉంటే ప్రేక్షకులు ఎలాంటి సినిమానైనా ఆదరిస్తారని ఈ చిత్రం నిరూపించింది. పైగా యానిమేటేడ్ వెర్షన్‌లో వ‌చ్చి ఇండియ‌న్ సినిమాల‌లో అత్యధిక క‌లెక్షన్లు సాధించిన చిత్రంగా 'మహావతార్ నరసింహ' సరికొత్త రికార్డును న‌మోదు చేసింది.

ఇది మహావతార్ సినిమాటిక్ యూనివర్స్ లో మొదటి చిత్రం కావడం విశేషంగా చెప్పుకోవాలి. సినిమాలోని విజువల్ ఎఫెక్ట్స్.. కథ ఒక ఎత్తు అయితే క్లీమ్ ప్రొడక్షన్స్ నిర్మాణం ఒక ఎత్తు. ఈ మూవీకి సామ్ సీఎస్ రూపొందించిన సంగీతం అదనపు ఆకర్షణగా నిలిచింది. పైగా మౌత్ టాక్ తోనే థియేటర్లకు జనం కుటుంబంలతో సహా క్యూ కడుతున్నారు. థియేటర్లలో ఈ సినిమా రికార్డులను తిరగరాస్తూ ఇంకా ఎంత దూరం వెళ్తుందో చూడాల్సిందే.

Read Also: Shyamala Devi: ప్రభాస్ పెళ్లి.. ఆ శుభ సమయం రానుంది

Read Also: Ntr - War-2: కన్నెర్ర చేశాడు... కాలర్ ఎగరేశాడు...

Updated Date - Aug 11 , 2025 | 06:31 PM