Indian Boxoffice: బాక్సాఫీస్ కలెక్షన్స్.. ఓర్మాక్స్ నివేదిక ఎలా ఉందంటే...
ABN, Publish Date - Jul 20 , 2025 | 10:59 AM
చూస్తుండగానే ఏడాది గిర్రున తిరిగొచ్చేస్తుంది. కాలం పరుగులు తీస్తోంది. అప్పుడే ఈ ఏడాది ప్రారంభమై ఆరు నెలలు పూర్తయ్యాయి. ఏడో నెల కూడా పూర్తి కావొస్తుంది. ఈ ఆరు నెలల కాలంలో ఎన్నో చిత్రాలు బాక్సాఫీస్ వద్ద అదృష్టాన్ని పరీక్షించుకున్నాయి.
చూస్తుండగానే ఏడాది గిర్రున తిరిగొచ్చేస్తుంది. కాలం పరుగులు తీస్తోంది. అప్పుడే ఈ ఏడాది ప్రారంభమై ఆరు నెలలు పూర్తయ్యాయి. ఏడో నెల కూడా పూర్తి కావొస్తుంది. ఈ ఆరు నెలల కాలంలో ఎన్నో చిత్రాలు బాక్సాఫీస్ వద్ద అదృష్టాన్ని పరీక్షించుకున్నాయి. ఈ ఏడాది ఫస్టాఫ్‌లో బాక్సాఫీసుకు రూ.5,723 కోట్లు వసూళ్లు దక్కాయి. ఈ విషయం గురించి చెబుతూ శనివారం ఓర్మాక్స్ మీడియా (Ormax media) ‘ఇండియా బాక్సాఫీస్ రిపోర్ట్: జనవరి-జూన్ 2025’ (The India Box Office Report) పేరుతో ఓ నివేదికను విడుదల చేసింది.
‘జనవరి-జూన్ నెలల్లో విడుదలైన సినిమాల బాక్సాఫీసు రాబడి రూ.5,723 కోట్లుగా ఉంది. గత సంవత్సరంతో కంపేర్ చేస్తే ఈ సంవత్సరం బాక్సాఫీసు దగ్గర వసూళ్లు 14 శాతం పెరిగాయి. ఇందులో భాగంగా 17 సినిమాలు రూ.100కోట్ల మార్క్‌ను దాటాయి’’ అని తెలిపింది.
ఈ నివేదిక ఆధారంగా చేసుకొని వసూళ్ల పరంగా ఏడాది ప్రథమార్థంలో రూ.693 కోట్ల వసూళ్లతో అగ్రస్థ్థానంలో నిలిచిన చిత్రం ‘‘ఛావా’ (Chhaava) దీని తదీని తర్వాత వెంకటేశ్ నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vastunnam) సినిమా ఉంది. ఈ చిత్రం రూ.222 కోట్లు కలెక్ట్ చేసింది. సితారే జమీన్ పర్ రూ.201 కోట్లు, హౌస్‌ఫుల్ 5 రూ. 200 కోట్లు వసూళ్లు రాబట్టాయి. సెకెండాఫ్ కూడా ఇదే జోరు కొనసాగితే ఈ ఏడాది బాక్సాఫీసు రూ.13,500 కోట్లతో రికార్డు స్థాయి వసూళ్లతో క్లోజ్ కావచ్చని ఓర్మాక్స్ పేర్కొంది. ఇది ఇండియన్ థియేటర్ మార్కెట్‌కు అత్యధిక వసూళ్లు సాధించిన సంవత్సరంగా మారుతుందని నివేదిక పేర్కొంది.
Pawan kalyan - Raashi khanna: ఉస్తాద్ సరసన ఛాన్స్ కొట్టేసింది..ALSO READ:
Producer Naga Vamsi: హరిహర వీరమల్లును డిస్ట్రబ్ చేయం.. నాగవంశీ కామెంట్స్