The Great Pre Wedding Show Teaser: నవ్వులు పూయిస్తున్న తిరువీర్ కొత్త సినిమా టీజర్
ABN, Publish Date - Sep 16 , 2025 | 07:10 PM
మసూద సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయాడు తిరువీర్(Tiruveer). ఈ సినిమా ఇచ్చిన హిట్ తో తిరువీర్ వరుస సినిమాలతో బిజీగా మారాడు.
The Great Pre Wedding Show Teaser: మసూద సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయాడు తిరువీర్(Tiruveer). ఈ సినిమా ఇచ్చిన హిట్ తో తిరువీర్ వరుస సినిమాలతో బిజీగా మారాడు. పరేషాన్, కుమారి శ్రీమతి లాంటి సినిమాలతో మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. మధ్యలో కొద్దిగా గ్యాప్ ఇచ్చిన తిరువీర్ ఇప్పుడు మరో కామెడీ ఎంటర్ టైనర్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. తిరువీర్ హీరోగా రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో (The Great Pre Wedding Show). సందీప్ అగరం మరియు అశ్మితా రెడ్డి బసాని నిర్మిస్తున్న ఈ చిత్రంలో తిరువీర్ సరసన టీనా శ్రావ్య నటిస్తుండగా.. #90s వెబ్ సిరీస్ తో పేరు తెచ్చుకున్న బాలనటుడు రోహన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.
ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. టీజర్ ఆద్యంతం నవ్వులు పూయిస్తుంది. టీజర్ ను బట్టి ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్ టైనర్ గా కనిపిస్తుంది. ఒక గ్రామంలో రమేష్.. ఫొటోగ్రఫీ స్టూడియో నడిపిస్తూ ఉంటాడు. ఆ చుట్టుపక్కల మండలంలో ఇదొక్కటే ఫొటోస్టూడియో కావడంతో పెళ్లి, ఫంక్షన్, పుట్టినరోజు ఏదైనా రమేష్ ఒక్కడే దిక్కు. అలాంటి అతగాడికి ఒక ప్రీ వెడ్డింగ్ షూట్ వీడియో తీయడానికి ఛాన్స్ వస్తుంది. ఆ ఒక్క షూట్ వలన రమేష్ పడిన అగచాట్లు ఏంటి.. ? అసలు ప్రీ వెడ్డింగ్ షూట్ అంటే ఏంటో తెలియని తల్లిదండ్రుల మధ్య రమేష్ ఎన్ని ఇబ్బందులు పడ్డాడు అసలు ఆ ప్రీ వెడ్డింగ్ షూట్ సక్సెస్ అయ్యిందా.. ? లేదా.. ? మధ్యలో రమేష్ ప్రేమించిన అమ్మాయి ఏమైంది.. ? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
పల్లెటూరు కథలు ఎంత ఫ్రెష్ గా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ టీజర్ కూడా ఎంతో ఫ్రెష్ గా కనిపిస్తుంది. ఆహ్లదకరంగా అనిపించే లొకేషన్స్.. ఎలాంటి బూతులు లేని కామెడీ.. అన్నింటికి మించి అమాయకంగా అనిపించే తిరువీర్ ముఖం చూస్తేనే నవ్వొచ్చేలా కనిపిస్తోంది. ఇక అతనికి తోడు చైల్డ్ ఆర్టిస్ట్ రోహన్ కూడా తోడవ్వడంతో మరింత కామెడీ జనరేట్ అవుతుంది అని తెలుస్తోంది. మొత్తానికి టీజర్ తోనే ఒక మంచి ఇంప్రెషన్ అయితే క్రియేట్ చేశారు. ఇకపోతే ఈ సినిమా నవంబర్ 7 న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో తిరువీర్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.
Kalyan Shankar: మ్యాడ్ డైరెక్టర్.. ఈసారి భయపెడతాడట
Prabhutva Sarai Dukanam: టీజర్.. ఇంత పచ్చిగా ఉందేంటి! బూతులే.. బూతులు