సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Jaya Shankar: ఏడేళ్ల అజ్ఞాతవాసానికి ప్రతిఫలం ‘అరి’.. దర్శకుడు చేసిన పరిశోధన ఇదే  

ABN, Publish Date - Oct 04 , 2025 | 02:48 PM

ప్రతి మనిషి ఎంచుకున్న రంగంలో సక్సెస్‌ కోసం మెషీన్‌లా పనిచేసే రోజులివి. అది సినిమా రంగం అయినా, మరే రంగమైనా కమర్షియల్‌ థాట్స్‌తో కాలంతో పరుగులు తీస్తున్నారు.

V Jaya Shankar


ప్రతి మనిషి ఎంచుకున్న రంగంలో సక్సెస్‌ కోసం మెషీన్‌లా పనిచేసే రోజులివి. అది సినిమా రంగం అయినా, మరే రంగమైనా కమర్షియల్‌ థాట్స్‌తో కాలంతో పరుగులు తీస్తున్నారు. సినిమా రంగంలో దర్శకులు నిరంతరం కథ,  స్క్రిప్ట్,  మంచి సినిమా తీయాలి, ప్రేక్షకులకు కొత్తగా ఏదో చెప్పాలనే తపనతో సతమతమవుతుంటారు. ‘పేపర్‌ బాయ్‌’ చిత్రంతో పేరొందిన దర్శకుడు జయశంకర్‌ అలా చేయలేదు. ఒక సినిమా సక్సెస్‌ తర్వాత ఆ పేరును, సక్సెస్‌ను పక్కనపెట్టి ఏడేళ్లపాటు అదృశ్యమయ్యారు. హిమాలయాలకు వెళ్లిపోయారు.

అక్కడికి వెళ్లినప్పుడు మళ్లీ సినిమా తీస్తాననే నమ్మకం ఉందో లేదో తెలీదు.  స్క్రిప్ట్  లేదు. ప్రొడ్యూసర్‌ లేడు. ఇంత కాలం ‘నేనేం సాధించాను.. ఏం కనుగొన్నాను’ అన్నదే ఆయన ఆలోచన. నక్షత్రాల కింద అనేక రాత్రులు, నిశబ్ధమైన సమయాన్ని గడిపారు. సద్గురు, సాధువులతోపాటు దేశంలోని 20కిపైగా ఆధ్యాత్మిక సంస్థలను సందర్శించారు. కాంచీ కామకొటి పీఠం, ఇస్కాన్‌, ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌, చిన్మయా మిషన్‌లను చుట్టొచ్చారు. భగవద్గీత, ఉపనిషత్తులు, వేదాలు, పురాణాలు, యోగవాసిష్ట వంటి గ్రంథాలను లోతుగా అధ్యయనం చేశారు. వీటి ద్వారా మనలో ఉండే ఆరుగురు శత్రువులు కామం, క్రోధం, లోభం, మోహం, మధం, మాత్సర్యాలను అధిగమించడానికి మార్గాలు తెలుసుకున్నారు. ఇవి కేవలం సాధువులు, యోగులకు మాత్రమే కాకుండా ఆధునిక జీవితంలో సమస్యలను ఎదుర్కొనే అందరిని సన్మార్గంలో నడిపిస్తాయని గ్రహించారు.  ఈ జర్నీ, ఏడేళ్ల త్యాగానికి ఫలితంగా పుట్టిందే ‘అరి’. 'ఇది  కేవలం సినిమా కాదు, ఎమోషన్‌ జర్నీ’ అని జయశంకర్‌ చెప్పారు. 



ఈ సినిమా విడుదల కాకముందే  ఆధ్యాత్మిక గురువులకు తమ ఆశ్రమాల్లో, యోగా కేంద్రాల్లో ‘అరి’ ప్రదర్శన జరిగింది. స్వీడన్‌ నుంచి  బెల్జియం వరకూ ఆరు అంతర్జాతీయ అవార్డులు సాధించింది.  కళాత్మకతతోపాటు ఆధ్యాత్మికతతో ప్రత్యేక గుర్తింపు పొందింది.  ప్రపంచవ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాలు, చలన చిత్రోత్సవాలు జయశంకర్‌ను ఈ సినిమా అనుభవాలు పంచుకోవడానికి ఆహ్వానించాయి.

ప్రపంచం ఈ సినిమా బ్యూటీని చూసింది అనడానికి అందుకున్న అవార్డులే నిదర్శనం. కానీ దీనిని సృష్టించడానికి దర్శకుడు చేసిన కృషి తపన కొందరికి మాత్రమే అర్థమవుతుంది. ఈ జర్నీలో ఏడు సంవత్సరాలు ఆదాయం లేకుండా గడపడం, మసకబారిన స్నేహాలు, దూరమైన పరిశ్రమ సంబంధాలు ఇలా ఎన్నో కష్టాలు ఎదురయ్యాయి. ‘చేసే పని విలువైనదేనా’ అంటూ అయన మార్మోగిన ప్రశ్న. కానీ జయశంకర్‌ ఆగలేదు. తన కథను నమ్మి ముందుకెళ్లాడు. ఎందుకంటే కొన్ని కథల్ని చెప్పడం అంత సులభం కాదు. అవి రాజీపడకుండా చేస్తాయి’ అన్నది జయశంకర్‌ మాట.  అక్టోబర్‌ 10న ‘అరి’ రిలీజ్‌ కానుంది.

 

Updated Date - Oct 04 , 2025 | 03:01 PM