Tollywood: నిన్న యూట్యూబ్ వ్యూస్.. ఇప్పుడు బుక్ మై షో టిక్కెట్స్….

ABN , Publish Date - Dec 26 , 2025 | 01:48 PM

సినిమా తీయటం ఒక ఎత్తు… దానిని చక్కటి ప్రచారం తో రిలీజ్ చేయటం మరో ఎత్తు. అందులో భాగంగానే ఇటీవల కాలం వరకూ సినిమాకు సంబంధించిన ట్రైలర్స్, టీజర్స్, పాటలు ఇలా ఒక్కొక్కటి రిలీజ్ చేస్తూ వాటికి వచ్చిన వ్యూస్ గురించి డబ్బాలు కొట్టుకుంటూ సినిమాలపై హైప్ క్రియేట్ చేయటానికి తాపత్రయపడుతూ సాగారు

సినిమా తీయటం ఒక ఎత్తు… దానిని చక్కటి ప్రచారం తో రిలీజ్ చేయటం మరో ఎత్తు. అందులో భాగంగానే ఇటీవల కాలం వరకూ సినిమాకు సంబంధించిన ట్రైలర్స్, టీజర్స్, పాటలు ఇలా ఒక్కొక్కటి రిలీజ్ చేస్తూ వాటికి వచ్చిన వ్యూస్ (Fake Views) గురించి డబ్బాలు కొట్టుకుంటూ సినిమాలపై హైప్ క్రియేట్ చేయటానికి తాపత్రయపడుతూ సాగారు మన దర్శకనిర్మాలు. వీరి ప్రయత్నాలను క్యాష్ చేసుకుంటూ కొందరు మీడియేటర్స్ 'యు ట్యూబ్'లో వ్యూస్ పెంచుతామని నిర్మాతల జేబులు ఖాళీ చేసేశారు.. చేస్తున్నారు.

ఇదిలా ఉంటే తాజాగా మరో స్కామ్ మొదలైంది. అదే బుక్ మై షో యాప్ లో (Book my show app) టిక్కెట్స్ కొనుగోలు. సినిమాలు రిలీజ్ అయిన తర్వాత ఆ యాప్ లో తమ సినిమా హౌస్ ఫుల్ అయిందనే టాక్ కోసం తమ సినిమాల టిక్కెట్స్ ను తామే కొనుగోలు చేస్తూ ఫాల్స్ టాక్ స్ప్రెడ్ చేసి బి.ఎం.ఎస్ రేటింగ్ అంత ఇంత అని డప్పు కొట్టుకుంటున్నారు. ఎవరి జేబులు వారు ఖాళీ చేసుకుంటే పర్వాలేదు. కానీ పోటాపోటీగా రిలీజ్ అయిన సినిమాల బుకింగ్స్ దగ్గర ఈ ట్రిక్ ప్లే చేసి తమ సినిమా హౌస్ ఫుల్ అనిపించుకుంటూ ఇతర సినిమాలు అంత క్రేజ్ లేదంటూ బి.ఎం.ఎస్ రేటింగ్ తక్కువ చూపించటంతో అసలు వ్యవహారం బట్టబయలు అయింది. బుక్ మై షో యాప్ రేటింగ్ అంతా బోగస్ అని తేలిపోయింది. ఓ సినిమా దర్శకనిర్మాతలైతే ఎకంగా ప్రెస్ మీట్ పెట్టి మరీ ఈ వ్యవహారాన్ని బట్టబయలు చేసేశారు.

సినిమా బాగా తీయటం పక్కన పెట్టి ఇలాంటి బోగస్ ప్రచారంతో మా సినిమా హిట్ అంటే మా సినిమా హిట్ అనే ధోరణి చిన్న సినిమాల మనుగడనే ప్రమాదంలో పడేలా చేస్తోంది. అసలు సినిమా రిలీజ్ తర్వాత మౌత్ టాక్ ని మించిన ప్రచారం లేదు. ప్రేక్షకులే అసలైన ప్రచార కర్తలు అని నమ్మి కంటెంట్ ఉన్న సినిమాలను రిలీజ్ చేసిన రోజున ఇలాంటి బోగస్ ప్రచారాలను నమ్ముకోవలసిన అవసరం ఉండదు.. దీనిని గుర్తించి ఇకపైనైనా దర్శకనిర్మాతలు కంటెంట్ పై దృష్టి పెట్టి ప్రేక్షకులను ఆకట్టుకునే సినిమాలు తీయాలని ఆశిద్దాం.

Updated Date - Dec 26 , 2025 | 01:48 PM