సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా  ది 100 ట్రైలర్ 

ABN, Publish Date - Jul 05 , 2025 | 08:40 PM

ఆర్కే సాగర్  హీరోగా నటిస్తున్న చిత్రం 'ది 100'. జూలై 11న థియేటర్స్ లోకి రానుంది. తాజాగా ఈ సినిమా  థియేట్రికల్ ట్రైలర్‌ను ఏపీ ఉప ముఖ్యమంత్రి  పవన్ కళ్యాణ్  లాంచ్ చేశారు.

The 100 Official Trailer

ఆర్కే సాగర్  (Rk Sagar)హీరోగా నటిస్తున్న చిత్రం 'ది 100' (The 100). జూలై 11న థియేటర్స్ లోకి రానుంది. ఈ హై-ఆక్టేన్ క్రైమ్ థ్రిల్లర్‌ను రాఘవ్ ఓంకార్ శశిధర్ దర్శకత్వం వహించారు. కెఆర్ఐఏ ఫిల్మ్ కార్ప్, ధమ్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌లపై రమేష్ కరుటూరి, వెంకి పుషడపు సంయుక్తంగా నిర్మించారు.  తాజాగా ఈ సినిమా  థియేట్రికల్ ట్రైలర్‌ను ఏపీ ఉప ముఖ్యమంత్రి  పవన్ కళ్యాణ్  లాంచ్ చేశారు.

"జీవితంలో జరిగిపోయినది మనం మార్చలేము, కానీ జరగబోయేదాన్ని ఖచ్చితంగా ఆపగలం" అని విక్రాంత్ ఐపీఎస్ వాయిస్‌ ఓవర్‌తో ట్రైలర్ ప్రారంభమవుతుంది. ఆయుధాన్ని ఎప్పుడూ ఉపయోగించకూడదనే రూల్ పెట్టుకుంటాడు. కానీ ఆత్మరక్షణ కోసం, అతను తాను ఆయుధంగా చూసుకోవడం ప్రారంభిస్తాడు. వ్యవస్థలోని శక్తివంతమైన వ్యక్తుల మద్దతుతో క్రూరమైన దొంగల ముఠా అతని జీవితంలో ఒక పెద్ద సవాలు ఎదురౌతుంది. అతని సొంత డిపార్ట్మెంటర్ కూడా అతనిపై ఆరోపణలు చేసి, చివరికి అతన్ని సస్పెండ్ చేస్తుంది. ఒకప్పుడు ఆయుధం తీసుకెళ్లనని శపథం చేసిన వ్యక్తి ఆయుధం తీసుకోవడం తప్ప వేరే మార్గం లేని పరిస్థితుల్లోకి వస్తాడు" అన్నది ట్రైలర్ లో చూపించారు

ఈ పాత్ర కోసం పూర్తిగా మేకోవర్ అయిన ఆర్‌కె సాగర్.. విక్రాంత్ ఐపీఎస్‌గా ఫిట్‌గా, అద్భుతంగా కనిపించారు. తన పెర్ఫార్మెన్స్ అదిరిపోయింది. మిషా నారంగ్ తన లవ్ ఇంట్రస్ట్ గా కనిపించి కథకు రొమాంటిక్ టచ్‌ను యాడ్ చేసింది. దర్శకుడు రాఘవ్ ఓంకార్ ఈ చిత్రాన్ని ప్రారంభం నుండి ముగింపు వరకు సస్పెన్స్, థ్రిల్స్ నిండిన ఇంటెన్స్,  గ్రిప్పింగ్ క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందించారు  

Updated Date - Jul 05 , 2025 | 10:28 PM