Tammareddy Bharadwaja: థాంక్ యూ డియర్ ఫస్ట్ లుక్ లాంచ్

ABN , Publish Date - May 23 , 2025 | 04:01 PM

రియల్ స్టార్ శ్రీహరి తనయుడు మేఘాంశ్ ఇప్పటికే చిత్రసీమలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు శ్రీహరి తమ్ముడు శ్రీధర్ కొడుకు ధనుష్ సైతం హీరోగా నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అతని రెండో సినిమా 'ధాంక్ యూ డియర్' విడుదలకు సిద్థమైంది...

అర్థాంతరంగా తనువు చాలించిన రియల్ స్టార్ శ్రీహరి (Srihari) చిత్రసీమలో ఎంతోమందికి లైఫ్ ఇచ్చారు. అయితే ఇప్పుడు ఆయన కుటుంబ సభ్యులు మాత్రం సినిమా రంగంలో నిలదొక్కుకోవడానికి కాస్తంత ఇబ్బందులు పడుతున్నారు. శ్రీహరి తనయుడు మేఘాంశ్ (Meghansh) 'రాజ్ దూత్' (Rajdooth) మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. కానీ ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఆ తర్వాత సతీశ్ వేగేశ్న (Sateesh Vegesna) దర్శకత్వంలో 'కోతికొమ్మచ్చి' (Kothi Kommachi) చిత్రంలో నటించాడు కానీ అది విడుదల కాలేదు. ఇప్పుడు శ్రీహరి ఉండగానే కొన్ని చిత్రాల్లో నటించిన ఆయన తమ్ముడు శ్రీధర్ కొడుకు ధనుష్ రఘుముద్రి (Dhanush Raghumudri) హీరోగా నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ధనుష్ గత యేడాది విడుదలైన 'తంత్ర' (Tantra) మూవీలో కీ-రోల్ ప్లే చేశాడు. అందులో అనన్య నాగళ్ళ (Ananya Nagalla) ప్రధాన పాత్రను పోషించింది. ఇప్పుడు ధనుష్‌ రఘుముద్రి మరో సినిమాలో హీరోగా నటించాడు. అదే 'ధ్యాంక్ యూ డియర్'.


హెబ్బా పటేల్, (Hebah Patel) రేఖ నిరోషా (Rekha Nirosha), వీరశంకర్ (Veera Shankar), నాగ మహేష్ (Naga Mahesh), రవి ప్రకాష్, ఛత్రపతి శేఖర్, బలగం సుజాత తదితరులు కీలక పాత్రు పోషించిన ఈ సినిమాను తోట శ్రీకాంత్ కుమార్ డైరెక్షన్ లో పప్పు బాలాజీ రెడ్డి నిర్మించారు. ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించారు. ఫస్ట్ లుక్‌ను చూసిన తమ్మారెడ్డి, చిత్ర బృందాన్ని ప్రశంసించారు. ఈ సినిమా ధనుష్‌కు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాలనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ, సినిమా ఘన విజయం సాధించాలని కోరుకున్నారు.

ఈ సందర్భంగా హీరో ధనుష్ మాట్లాడుతూ, ‘థాంక్ యూ డియర్’ తన రెండో చిత్రమని, తమ్మారెడ్డి లాంటి సీనియర్ ప్రొడ్యూసర్ తమ సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేయడం ఆనందంగా ఉందని తెలిపారు. ఈ సినిమా తన కెరీర్‌లో కీలకమైనదని, ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నిర్మాత పప్పు బాలాజీ రెడ్డి మాట్లాడుతూ, ఈ చిత్రం ధనుష్‌కు గొప్ప పేరు తెస్తుందని, తమ్మారెడ్డి లాంటి ప్రముఖులు ఫస్ట్ లుక్‌ను విడుదల చేయడం తమకు ప్రోత్సాహకరంగా ఉందని అన్నారు. సినిమా ప్రేక్షకులను ఆకర్షిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. లైన్ ప్రొడ్యూసర్ పునీత్ రెడ్డి మాట్లాడుతూ, తమ్మారెడ్డి భరద్వాజ లాంటి సినీ పెద్ద ఈ ఫస్ట్ లుక్‌ను విడుదల చేయడం సంతోషకరమని, సినిమాను ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందించామని తెలిపారు. ఈ చిత్రం యువతని కచ్చితంగా ఆకట్టుకొని విజయవంత మవుతుందని అన్నారు.

Also Read: Allu Arjun: తొలి చిత్ర దర్శకుడిని ఫోటో పెట్టుకున్న బన్నీ...

Also Read: Kayadu Lohar: నైట్ పార్టీకి రూ.35 ల‌క్ష‌లు... చిక్కుల్లో డ్రాగ‌న్ బ్యూటీ... లిక్క‌ర్ స్కాంలో పేరు

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - May 23 , 2025 | 04:15 PM