Thammudu: తమ్ముడు ట్రైలర్ రిలీజ్ డేట్ చెప్పిన మేకర్స్
ABN, Publish Date - Jun 09 , 2025 | 04:55 PM
యంగ్ హీరో నితిన్(Nithiin) ఎప్పటి నుంచో ఒక మంచి హిట్ కోసం కష్టపడుతున్నాడు.
Thammudu: యంగ్ హీరో నితిన్(Nithiin) ఎప్పటి నుంచో ఒక మంచి హిట్ కోసం కష్టపడుతున్నాడు. మాచర్ల నియోజక వర్గం, ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాలు ఆశించిన ఫలితాన్ని అందివ్వలేకపోయాయి. ఈ మధ్యనే రిలీజ్ అయిన రాబిన్ హుడ్(Robinhood) కూడా నితిన్ కి హిట్ ను ఇవ్వలేదు. ఇక ఇప్పుడు నితిన్ ఆశలన్నీ తమ్ముడు సినిమా మీదనే ఉన్నాయి.
నితిన్ హీరోగా వేణు శ్రీరామ్(Venu Sriram) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం తమ్ముడు(Thammudu). దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో సప్తమి గౌడ(Sapthami Gowda), లయ(Laya), వర్ష బొల్లమ్మ(Varsha Bollamma), సౌరభ్ సచ్దేవా, స్వసిక కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తమ్ముడు సినిమా కూడా వాయిదాల మీదనే నడుస్తోంది. ఇక చివరకు జూలై 4 న ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇది కూడా వాయిదా పడుతుందా.. ? అనే అనుమానంలో ఉన్న ఫ్యాన్స్.. మేకర్స్ ప్రమోషన్స్ మొదలుపెట్టడంతో వాయిదా పడదని క్లారిటీ వచ్చేసింది.
రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్ ట్రైలర్ రిలీజ్ కు ముహూర్తం ఖరారు చేశారు. సినిమాలో ఉన్న హీరోయిన్లందరితో ఒక వీడియో చేయించారు మేకర్స్. సప్తమి గౌడ, లయ, వర్ష బొల్లమ్మ, స్వసిక.. నేను చెప్తేనే రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారని, అసలు మీరెవరు.. ? ఏ సినిమాలోనటించారు అంటూ ఒకరిపై ఒకరు గొడవపడుతున్న సమయంలో డైరెక్టర్ వేణు శ్రీరామ్ వచ్చి.. అన్ని ట్రైలర్ లో తెలుస్తాయి. జూన్ 11 న సాయంత్రం 5 గంటలకు తమ్ముడు ట్రైలర్ రిలీజ్ కానుందని చెప్పుకొచ్చాడు. మొదటి నుంచి సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. అందులో పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ చిత్రం తమ్ముడు టైటిల్ ను పెట్టడంతో.. పవన్ ఫ్యాన్స్ కూడా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. దీంతో పాటు సీనియర్ నటి లయ.. ఈ సినిమాతో రీఎంట్రీ ఇవ్వడం కూడా హైప్ ను క్రియేట్ చేసింది. మరి ఈ సినిమాతో నితిన్ హిట్ ను అందుకుంటాడా.. ? లేదా.. ? అనేది చూడాలి.