ఏంటి మీ గోల.. 'తమ్ముడు' ప్రమోషన్స్ ఇలా
ABN, Publish Date - Jun 09 , 2025 | 04:52 PM
హీరో నితిన్ హీరోగా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో వస్తున్న ‘తమ్ముడు’ (Thammudu) సినిమా ప్రమోషన్స్ వినూత్నంగా ప్రయత్నం చేస్తున్నారు చిత్ర బృందం. శ్రీరామ్ వేణు పుట్టిన రోజున సినిమా విడుదల ఎప్పుడు అంటూ ఓ ఆసక్తికర వీడియో వదిలారు. ఇప్పుడు మరోసారి ఇందులో హీరోయిన్స్ గా నటించిన వర్ష బొల్లమ్మ, శ్వాసిక, సప్తమి గౌడ, సీనియర్ నటి లయ రిలీజ్ డేట్ వచ్చింది 'నా వల్ల.. అంటే నా వల్ల' అని డైరెక్టర్ ని సతాయిస్తున్న వీడియో ఒకటి విడుదల చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. చివరిలో దర్శకుడు ఇచ్చి.. అన్నింటికీ సమాధానం ట్రైలర్ అని, అది ఈ నెల 11న (Thammudu trailer release date) సాయంత్రం 5 గంటలకు విడుదలవుతుందని తెలిపారు.