సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Varun Tejs VT15: శరవేగంగా మ్యూజిక్‌ సెషన్స్‌

ABN, Publish Date - Jul 22 , 2025 | 06:05 AM

వరుణ్‌తేజ్‌ కథానాయకుడిగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ‘వీటీ15(వర్కింగ్‌ టైటిల్‌)’ సినిమా మ్యూజిక్‌ సెషన్లు...

వరుణ్‌తేజ్‌ కథానాయకుడిగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ‘వీటీ15(వర్కింగ్‌ టైటిల్‌)’ సినిమా మ్యూజిక్‌ సెషన్లు శరవేగంగా జరుగుతున్నాయి. థమన్‌ సంగీతం అందిస్తున్నారు. ‘తొలిప్రేమ’ తర్వాత వరుణ్‌ - థమన్‌ కాంబినేషన్‌ మరోసారి అద్భుతమైన ఆల్బమ్‌ ఇవ్వబోతున్నారని, ఇప్పటికే రెండు పాటలు పూర్తయ్యాయని మేకర్స్‌ తెలిపారు. కాగా, ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్‌, ఫస్ట్‌ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థలు నిర్మిస్తున్నాయి. ఇప్పటికే మూడు మేజర్‌ షెడ్యూళ్లను ఇండియా, విదేశాల్లో చిత్రీకరించారు. ప్రస్తుతం సినిమా షూటింగ్‌ తుది దశకు చేరుకుంది. త్వరలోనే టైటిల్‌, ఫస్ట్‌ గ్లింప్స్‌ విడుదల చేయనున్నట్లు చిత్రబృందం పేర్కొంది.

Updated Date - Jul 22 , 2025 | 06:05 AM