Keerthy Suresh: మహానటి లైనప్ చూస్తే మెంటలొచ్చేస్తుందిగా..

ABN , Publish Date - Nov 07 , 2025 | 07:31 PM

సాధారణంగా హీరోయిన్లకు పెళ్లి తరువాత అవకాశాలు తక్కువ వస్తాయి. కానీ, మహానటి కీర్తి సురేష్ (Keerthy Suresh) మాత్రం పెళ్లి తరువాతనే జోరు పెంచింది.

Keerthy Suresh

Keerthy Suresh: సాధారణంగా హీరోయిన్లకు పెళ్లి తరువాత అవకాశాలు తక్కువ వస్తాయి. కానీ, మహానటి కీర్తి సురేష్ (Keerthy Suresh) మాత్రం పెళ్లి తరువాతనే జోరు పెంచింది. పెళ్లి తరువాత అందాలను ఆరబోయడం మొదలుపెట్టింది. ఇక బరువు తగ్గి నాజూకుగా తయారైన కీర్తి మరిన్ని అవకాశాలను అందుకుంటూ ముందుకు దూసుకుపోతుంది. ప్రస్తుతం అమ్మడి చేతిలో ఒకటి కాదు రెండు కాదు అరడజను సినిమాలు ఉన్నాయి. అయితే సినిమాలు ఓకే కానీ, విజయాలనే అందుకోలేకపోతుంది కీర్తి.

గతేడాది బేబీ జాన్ సినిమాతో బాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన ఈ భామ అక్కడ పరాజయాన్ని అందుకుంది. అయినా కూడా కీర్తి భయపడలేదు. వరుస ఛాన్సులను పట్టేసి మిగతా హీరోయిన్లకు షాక్ ఇస్తుంది. ఇప్పటికే తెలుగులో విజయ్ దేవరకొండ సరసన రౌడీ జనార్దన్ లో అమ్మడు కన్ఫర్మ్ అయ్యింది. ఈ మధ్యనే పూజా కార్యక్రమాలను కూడా ఫినిష్ చేసి సెట్స్ మీదకు వెళ్ళింది. ఇక ఇది కాకుండా అక్క సినిమా చేస్తోంది. నెట్ ఫ్లిక్స్ ఒరిజినల్ గా తెరకెక్కిన ఈ చిత్రం కూడా త్వరలోనే రిలీజ్ కానుంది. ఇందులో పవర్ ఫుల్ మాఫియా డాన్ గా కీర్తి నటిస్తుంది.

ఇక రివాల్వర్ రీటా సినిమాను అమ్మడు పెళ్ళికి ముందే ప్రకటించింది. ఈ సినిమా కూడా ఫినిషింగ్ స్టేజ్ లో ఉందని సమాచారం. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మిస్కిన్ థ్రిల్లర్ సినిమాలో కూడా కీర్తినే హీరోయిన్ గా ఎంపిక అయ్యిందని సమాచారం. ఇవన్నీ కాకుండా ఈ మధ్యనే అమ్మడు మలయాళంలో తొట్టం సినిమా చేస్తున్నట్లు ప్రకటించింది. ఆంటోనీ వర్గీస్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కానుంది. ఇలా తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో అమ్మడు లైనప్ చూస్తుంటే మెంటల్ వచ్చేస్తోంది. మరి ఈ సినిమాలతో ఈ చిన్నది ఎలాంటి విజయాలను అందుకుంటుందో చూడాలి.

Samantha: బాయ్ ఫ్రెండ్ బిగి కౌగిలిలో సమంత.. సాహసోపేతమైన అడుగు అంటూ పోస్ట్

Aaryan Review: మర్డర్ మిస్టరీ 'ఆర్యన్' సినిమా ఎలా ఉందంటే

Updated Date - Nov 07 , 2025 | 08:05 PM