సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Love Story: చెన్నైలో తెలుగు అబ్బాయి కథ

ABN, Publish Date - Jul 13 , 2025 | 02:02 AM

సంతోష్‌ శోభన్‌ హీరోగా నటిస్తోన్న చిత్రం ‘కపుల్‌ ఫ్రెండ్లీ’. అశ్విన్‌ చంద్రశేఖర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. యూవీ క్రియేషన్స్‌ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్‌ తెలుగు, తమిళ భాషల్లో...

సంతోష్‌ శోభన్‌ హీరోగా నటిస్తోన్న చిత్రం ‘కపుల్‌ ఫ్రెండ్లీ’. అశ్విన్‌ చంద్రశేఖర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. యూవీ క్రియేషన్స్‌ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్‌ తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తోంది. మ్యూజికల్‌ రొమాంటిక్‌ లవ్‌స్టోరీగా ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. శనివారం సంతోష్‌ శోభన్‌ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు చెబుతూ చిత్రబృందం స్పెషల్‌ పోస్టర్‌ని రిలీజ్‌ చేసింది. పోస్టర్‌లో చెన్నైలో జీవనం కొనసాగిస్తున్న మధ్యతరగతి తెలుగు అబ్బాయిగా సంతోష్‌ శోభన్‌ కనిపిస్తున్నారు. చెన్నై నగరం బ్యాక్‌డ్రా్‌పలో సాగే ఈ ప్రేమ కథా చిత్రం ప్రేక్షకులకు మంచి అనుభూతిని కలిగిస్తుందని చిత్రబృందం పేర్కొంది.

Updated Date - Jul 13 , 2025 | 02:08 AM