సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Roshan Meka: గ్రీక్ గాడ్.. అప్పుడే హృతిక్ తో పోలుస్తున్నారే

ABN, Publish Date - Dec 19 , 2025 | 09:38 PM

తెలుగు ప్రేక్షకులకు ఒకసారి ఎవరైనా నచ్చితే.. వారిని జీవితాంతం అభిమానిస్తూనే ఉంటారు. ఇక ఇండస్ట్రీలో చాలామంది కుర్ర హీరోలకు దక్కని బిరుదును టాలీవుడ్ ప్రేక్షకులు ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న హీరో రోషన్ మేక (Roshan Meka)కు ఇచ్చేశారు.

Roshan Meka

Roshan Meka: తెలుగు ప్రేక్షకులకు ఒకసారి ఎవరైనా నచ్చితే.. వారిని జీవితాంతం అభిమానిస్తూనే ఉంటారు. ఇక ఇండస్ట్రీలో చాలామంది కుర్ర హీరోలకు దక్కని బిరుదును టాలీవుడ్ ప్రేక్షకులు ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న హీరో రోషన్ మేక (Roshan Meka)కు ఇచ్చేశారు. హీరో శ్రీకాంత్ (Srikanth) నటవారసుడిగా పెళ్లి సందD సినిమాతో రోషన్ టాలీవుడ్ కి పరిచయమయ్యాడు. నూనూగు మీసాలతో రోషన్.. శ్రీలీలతో ఆడిపాడుతుంటే.. ఒక ఒక్క శ్రీకాంత్ ని ఇంకోపక్క ఊహను చూసినట్లు అనిపించింది. ఇక ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందించలేకపోయినా రోషన్ కి మంచి అవకాశాలను తీసుకొచ్చిపెట్టింది.

సినిమా అయిన వెంటనే ఇంకో సినిమా అని కాకుండా ఆచితూచి అడుగులు వేయడం నేర్చుకున్నాడు రోషన్. అందులో భాగంగానే తన పాత్రకు ప్రాధాన్యత లేని వృషభ నుంచి కూడా తప్పుకొని.. వైజయంతీ మూవీస్ బ్యానర్ లో ఛాంపియన్ గా ఎంటర్ అయ్యాడు. రోషన్ హీరోగా ప్రదీప్ అద్వైతం దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఛాంపియన్. అనస్వర రాజన్ హీరోయిన్ గా పరిచయమవుతున్న ఈ చిత్రంలో కళ్యాణ్ చక్రవర్తి. అర్చన కీలక పాత్రల్లో నటించారు.

ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఛాంపియన్ సినిమా పోస్టర్ రిలీజ్ అయిన దగ్గర నుంచి రోషన్ లుక్ కి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఎర్రటి గడ్డం, పిల్లి కళ్లు, పొడుగాటి జుట్టు.. ఇవన్నీ చూస్తుంటే బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ ని తలపిస్తున్నాయని చెప్పుకొస్తున్నారు. ట్రైలర్ తరువాత ఏకంగా టాలీవుడ్ గ్రీక్ గాడ్ అని చెప్పుకొచ్చేస్తున్నారు. ఆ క్లాస్ లుక్, మెరుస్తున్న ముఖం.. ఆ కళ్లలో ఏదో తెలియని ఒక మెరుపు.. హృతిక్ ని చూసినట్లు ఉందని అంటున్నారు. సినిమా రిలీజ్ కూడా కాకముందే జూనియర్ హృతిక్ రోషన్ అని బిరుదు ఇచ్చేస్తున్నారు. మరి రోషన్ ఈ సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Updated Date - Dec 19 , 2025 | 09:50 PM