Hema: నటి హేమ కుటుంబంలో విషాదం.. తల్లి కన్నుమూత
ABN, Publish Date - Nov 18 , 2025 | 06:08 PM
టాలీవుడ్ నటి హేమ కుటుంబంలో విషాదం నెలకొంది. హేమ తల్లి కోళ్ల లక్ష్మి అనారోగ్యంతో తూర్పుగోదావరి జిల్లా రాజోలులో మంగళవారం కన్నుమూశారు.
టాలీవుడ్ నటి హేమ కుటుంబంలో విషాదం నెలకొంది. హేమ తల్లి కోళ్ల లక్ష్మి (Kolla Lakshmi) అనారోగ్యంతో తూర్పుగోదావరి జిల్లా – రాజోలులో మంగళవారం కన్నుమూశారు. స్వస్థలంలోనే చికిత్స పొందుతూ ఆమె తుదిశ్వాస విడిచినట్టు కుటుంబసభ్యులు తెలిపారు.
విషయం తెలిసిన వెంటనే హేమ వెంటనే రాజోలు చేరుకున్నారు. తల్లి మృతదేహాన్ని చూసిన ఆమె భావోద్వేగానికి లోనయ్యారు. ఉదయం వరకు బాగానే మాట్లాడుతూ ఉన్న అమ్మ ఇలా ఒక్కసారిగా దూరమైపోవడం నమ్మశక్యంగా లేదని హేమ విలపించారు.
కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానికులు ఆమెకు సానుభూతి తెలుపుతున్నారు. కోళ్ల లక్ష్మి అంత్యక్రియలు స్వగ్రామంలోనే నిర్వహించనున్నట్టు సమాచారం.