Tharun Bhascker: జర్నలిస్ట్ కాళ్లపై పడ్డ తరుణ్ భాస్కర్.. వీడియో వైర‌ల్‌

ABN , Publish Date - Dec 09 , 2025 | 07:00 AM

తరుణ్ భాస్కర్ హీరోగా న‌టించిన ‘ఓం శాంతి శాంతి శాంతిః సినిమా ఈవెంట్‌లో త‌రుణ్‌ జర్నలిస్ట్ కాళ్లకు మొక్కిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

Tharun Bhascker

తరుణ్‌ భాస్కర్ (Tharun Bhascker), ఈషా రెబ్బ (Eesha Rebba) ప్రధాన పాత్రధారులుగా నూతన దర్శకుడు ఏ.ఆర్‌.సజీవ్‌ తెరకెక్కిస్తోన్న విలేజ్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ ‘ఓం శాంతి శాంతి శాంతిః’(Om Shanti Shanti Shantihi).ఎస్‌.ఒరిజినల్స్‌, మూవీ వెర్స్‌ స్టూడియోస్‌ బేనర్లపై సృజన్‌ యరబోలు, వివేక్‌ కృష్ణని, అనుప్‌ చంద్రశేఖరన్‌, సాధిక్‌ షేక్‌, నవీన్‌ శనివరపు, కిశోర్‌ జాలాది, బాల సౌమిత్రి నిర్మిస్తున్నారు. జనవరి 23న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

సోమవారం నిర్వహించిన వేడుకలో టీజర్‌ను మేకర్స్‌ ఆవిష్కరించారు. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ టీజర్‌లో..స్వార్థపూరిత స్వభావం గల ధనవంతుడైన చేపల వ్యాపారి అంబటి ఓంకార్‌ నాయుడి చుట్టూ కథ సాగుతుంది. కార్యక్రమంలో తరుణ్‌ భాస్కర్‌ మాట్లాడుతూ ‘ఈ సినిమాతో బ్రహ్మాజీకి మంచి పేరు వస్తుంది. ఈ సినిమా గోదావరి యాస, సాంస్కృతికి అద్ధం పడుతూ గోప్ప అనుభూతిని ఇవ్వడంతో పాటు ఆద్యంతం నవ్వులు పంచుతుంది’ అని అన్నారు.

రాజమండ్రి నాది.. వరంగల్‌ నాది

హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో అమర గాయకుడు ఎస్పీ బాల బాలసుబ్రహ్మణ్యం విగ్రహ ప్రతిష్ఠ వివాదంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు తరుణ్‌ భాస్కర్‌ స్పందించారు. ‘ఈ విషయంలో నా అభిప్రాయాన్ని తెలియజేస్తా.. పాలన పరంగా మనం వేరుగా ఉండొచ్చు. సంస్కృతి, సంప్రదాయాల పరంగా మాత్రం మనమంతా ఒక్కటే. ఆంధ్రా, తెలంగాణ అని కాకుండా మనదేశంలో గొప్ప నటులు, టెక్నీషియన్లు ఉన్నారు. రెండు రాష్ట్రాల నుంచి నేను ఎంతో స్ఫూర్తి పొందాను. రాజమండ్రి నాది..వరంగల్‌ నాది... సినిమా ద్వారా అందరికీ ప్రేమను పంచుదాం’ అని అన్నారు.

ఇదిలాఉంటే.. ఈవెంట్ మ‌ధ్య‌లో ఉండ‌గా త‌రుణ్ భాస్క‌ర్ అక్క‌డ‌కు వ‌చ్చిన ఓ జ‌ర్న‌లిస్టుకు ముందుగా మీకు హ్యాపీ క్రిస్మ‌స్ అని చెప్పగా ఆ జ‌ర్న‌లిస్టు కాస్త‌ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ చేసిన కామెంట్లు వైర‌ల్ అవుతున్నాయి. అంత‌కుముందు అలానే అన్నారు బాగా ట్రోల్ చేశారు.. మ‌ర‌లా అంటున్నారు. అంటే మేము అన‌లేమా మిమ్మ‌ల్ని, ఫెయిల్యూర్ హీరో, డైరెక్ట‌ర్ అని అంటూ సీరియ‌స్ అయి అక్క‌డి నుంచి వెళ్లిపోయే ప్ర‌య‌త్నం చేయ‌గా ఒక్క‌సారిగా జ‌రిగిన ఈ ప‌రిణామంతో షాకైన‌ త‌రుణ్ వెంట‌నే తేరుకుని ఆ ఇష్యూని స‌ర్దుబాటు చేశారు. వెళ్లి జ‌ర్నలిస్ట్ కాళ్లకు న‌మ‌స్కారం చేసి ఆ ఇష్యూ స‌మిసి పోయేలా చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో బాగా వైర‌ల్ అవుతోంది.

Updated Date - Dec 09 , 2025 | 07:01 AM