సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Breaking: ప్ర‌ముఖ ర‌చయిత.. అందెశ్రీ క‌న్నుమూత‌

ABN, Publish Date - Nov 10 , 2025 | 08:22 AM

ప్రముఖ కవి, గేయరచయిత అందెశ్రీ (Andesri) క‌న్నుమూశారు

ande

తెలుగు సాహిత్య ప్రపంచం, సినిమాల‌తో ప్రాధాన్యం పొందిన ప్రముఖ కవి, గేయరచయిత అందెశ్రీ (Andesri) క‌న్నుమూశారు. ఈ తెల్ల‌వారుజామున ఆయన తీవ్ర అస్వస్థతకు గురై ఇంట్లో కుప్పకూలారు. దీంతో ఆయన్ను కుటుంబ సభ్యులు గాంధీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

ఇదిలాఉంటే.. తెలంగాణ సాంస్కృతిక చైతన్యానికి ప్రతీకగా నిలిచిన అందెశ్రీ “జయ జయ హే తెలంగాణ” రాష్ట్ర గీతాన్ని రచించి ప్రతి తెలుగు మనసులో చిరస్మరణీయుడయ్యారు. అందెశ్రీ మృతిపై అభిమానులు, సాహితీ వర్గాలు, సినీ ప్రముఖులు దిగ్బ్రాంతి వ్య‌క్తం చేస్తూ సోషల్ మీడియాలో సంతాపం తెలియ‌జేస్తున్నారు. తెలంగాణ ప్ర‌భుత్వం, సీఎం రేవంత్ రెడ్డి సైతం సంతాపం తెలియ‌జేశారు.

Updated Date - Nov 10 , 2025 | 08:32 AM