సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

OG Tickets Issue: ఓజీ టికెట్‌ రేట్ల పెంపు రద్దు.. మంగ‌ళ‌వారం నుంచి సాధార‌ణ ధ‌ర‌లు

ABN, Publish Date - Sep 29 , 2025 | 10:38 PM

‘ఓజీ’ (OG) సినిమా టికెట్‌ రేట్ల పెంపును రద్దు చేయాలంటూ తెలంగాణ పోలీస్‌ (Telangana police) శాఖ సోమవారం జీవోను విడుదల చేసింది.

‘ఓజీ’ (OG) సినిమా టికెట్‌ రేట్ల పెంపును రద్దు చేయాలంటూ తెలంగాణ పోలీస్‌ (Telangana police) శాఖ సోమవారం జీవోను విడుదల చేసింది. సింగిల్‌ స్ర్కీన్స్‌, మల్టీప్లెక్స్‌ యాజమాన్యాలను పెంచిన ధరలను తక్షణమే తగ్గించాలని ఆదేశించింది. టికెట్‌ ధరల పెంపును తెలంగాణ హైకోర్టును సస్పెండ్‌ చేయడాన్ని, ఆ తర్వాత పరిణామాలను జీవోలో పేర్కొంది. సినిమా విడుదలకు ముందు.. ప్రీమియర్‌ ప్రదర్శనతోపాటు సెప్టెంబరు 25, సినిమా విడుదల రోజు నుంచి అక్టోబరు 4 వరకు టికెట్‌ రేట్లు పెంచుకోవడానికి సర్కార్‌ అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే!

దానికి సంబంధించిన మెమోను సవాల్‌ చేస్తూ మహేశ్‌ యాదవ్‌ అనే వ్యక్తి హైకోర్టులో పిటీషన్‌ వేశారు. విచారణ అనంతరం ఆ ఉత్తర్వులను సస్పెండ్‌ చేస్తూ.. జస్టిస్‌ ఎన్వీ శ్రవణ్‌కుమార్‌ ఈ నెల 24న ఆదేశాలు జారీ చేశారు. ఈ సినిమా టికెట్‌ రేట్లపై సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పుపై డివిజన్‌ బెంచ్‌ 26వ తేది వరకు ేస్ట ఇచ్చింది. రివ్యూ పిటిషన్‌పై ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు టికెట్‌ ధరలు పెంచడానికి వీల్లేదని స్పష్టం చేసింది. హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన ఆదేశాలు కొనసాగుతాయని తెలిపింది. టికెట్‌ ధరలు ఎందుకు పెంచాలనుకుంటున్నారో తెలియజేస్తూ ప్రభుత్వం కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి వాయిదా అక్టోబర్‌ 9కి వేసింది. పవన్‌ కల్యాణ్‌ హీరోగా సుజీత్‌ దర్శకత్వంలో డి.వి.వి దానయ్య నిర్మించిన ఈ చిత్రం 25నవిడుదలై భారీ విజయం సాధించింది. నాలుగు రోజుల్లో రూ. 252 కోట్లు వసూళ్లు రాబట్టింది.

Updated Date - Sep 29 , 2025 | 10:44 PM