సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Akhanda 2: రూ.600.. తెలంగాణ‌లోనూ 'అఖండ‌2' టిక్కెట్ రేట్ల పెంపు!

ABN, Publish Date - Dec 04 , 2025 | 03:46 PM

అఖండ 2 తాండవం సినిమా టిక్కెట్ రేట్లు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం సైతం నిర్ణయం తీసుకుంది. ప్రీమియర్ షోస్ కు కూడా తెలంగాణ ప్రభుత్వం అనుమతిని ఇచ్చింది. టిక్కెట్ రేట్ల పెంపును మూడు రోజులకు పరిమితం చేయడం విశేషం.

Akhanda 2 Thandavam Movie

నందమూరి బాలకృష్ణ 'అఖండ -2' (Akhanda 2) సినిమాకు ఆంధ్రప్రదేశ్ లో ప్రీమియర్ షోస్ ప్రదర్శించడానికి, టిక్కెట్ రేట్లను పెంచుకోవడానికి అక్కడి ప్రభుత్వం అనుమతి ఇస్తూ ఇప్పటికే స్పెషల్ జీవోను జారీ చేసింది. మరి తెలంగాణ పరిస్థితి ఏమిటనే ప్రశ్న ఇవాళ్టి వరకూ అనేకమంది మదిలో మెదులుతూ ఉంది.

ఇప్పుడు దానికి తెర పడింది. తెలంగాణ ప్రభుత్వం సైతం గురువారం రాత్రి ఒక స్పెషల్ షో ప్రదర్శించడానికి అనుమతి ఇచ్చింది. ఈ ప్రీమియర్ షో కు రూ. 600 టిక్కెట్ ధరను పెట్టింది. ఆంధ్రలోనూ ఇదే ధరను అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది.

అయితే 5వ తేదీ నుండి పది రోజుల పాటు ఆంధ్ర ప్రదేశ్ లో సింగిల్ స్క్రీన్స్ కు 75 రూపాయలు, మల్టీప్లెక్స్ థియేటర్లకు 100 రూపాయలు పెంచుకునే అవకాశం కల్పించగా, తెలంగాణలో మాత్రం కేవలం మూడు రోజులకే టిక్కెట్ రేట్లు పెంచుకునే అవకాశాన్ని ఇచ్చింది. శుక్ర, శని, ఆదివారాల్లో మాత్రమే టిక్కెట్ రేట్లు పెంచుకోవచ్చని జీవో లో తెలిపింది.అలానే సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ. 50 మల్టీప్లెక్స్ థియేటర్లలో రూ. 100 పెంచుకోవచ్చని పేర్కొంది.

అయితే ఇటీవల తెలంగాణ సీ.ఎం. రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా టిక్కెట్ రేట్లు పెంచడం ద్వారా వచ్చే లాభాల్లో 20 శాతాన్ని సినీ కార్మికుల వెల్ఫేర్ కోసం వినియోగించాలని, ఆ మొత్తాన్ని సంబంధిత వర్గాలు ఎఫ్.డి.సి.లో డిపాజిట్ చేయాల్సి ఉంటుందని ప్రభుత్వం ఇచ్చిన జీవో లో పేర్కొన్నారు.

ఈ యేడాది సంక్రాంతికి విడుదలైన వెంకటేశ్‌ (Venkatesh) 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా ఏకంగా రూ. 300 కోట్ల గ్రాస్ ను వసూలు చేసి, సింగిల్ లాంగ్వేజ్ మూవీస్ లో సరికొత్త రికార్డ్ నెలకొల్పింది. మరే సీనియర్ హీరో సినిమా కూడా ఈ మాత్రం గ్రాస్ ను వసూలు చేయలేదు. అయితే ఆ తర్వాత వచ్చిన పవన్ కళ్యాణ్‌ (Pawan Kalyan) 'ఓజీ' వివిధ భాషల్లో విడుదలైన దాదాపు రూ. 308 కోట్ల రూపాయలను వసూలు చేసినట్టు ట్రేడ్ వర్గాలు తెలిపారు.

సో... ఇప్పుడు 'అఖండ -2' పాన్ ఇండియాలో విడుదల అవుతుండటం, అలానే టిక్కెట్ రేట్లు తెలంగాణలోనూ పెంచుకునే అవకాశం లభించడంతో ఈ రెండు సినిమాల రికార్డులను బ్రద్దలు కొట్టే అవకాశం ఉందని అభిమానులు, ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. సో... అఖండ -2 సృష్టించబోయే రికార్డుల మీదే ఇప్పుడు అందరి దృష్టీ ఉంది.

Updated Date - Dec 04 , 2025 | 04:27 PM