OG Movie: తెలంగాణలో ఓజీ టికెట్ రేట్ ఎంత పెంచారంటే
ABN, Publish Date - Sep 19 , 2025 | 09:46 PM
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), ప్రియాంక మోహన్ (Priyanka Mohan)జంటగా సుజీత్ (Sujeeth) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఓజీ(OG).
OG Movie: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), ప్రియాంక మోహన్ (Priyanka Mohan)జంటగా సుజీత్ (Sujeeth) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఓజీ(OG). డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఇమ్రాన్ హష్మీ విలన్ గా నటిస్తుండగా.. అర్జున్ దాస్, ప్రకాష్ రాజ్, శ్రియా రెడ్డి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడంతో పాటు భారీ హైప్ ను తీసుకొచ్చిపెట్టాయి. సెప్టెంబర్ 25 న ఓజీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇక ప్రతి పెద్ద సినిమాకు ప్రీమియర్స్ కోసం ప్రభుత్వాల పర్మిషన్ తీసుకోవడం అందరికీ తెల్సిందే. అయితే తెలంగాణలో పుష్ప 2 సమయంలో జరిగిన విషాద ఘటన తరువాత ప్రీమియర్స్ కు ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వడం లేదు. అయితే ఓజీకి మాత్రం ప్రీమియర్స్ కు పర్మిషన్ తో పాటు టికెట్ రేట్లను పెంచుకొనే అవకాశం కల్పించింది. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ప్రీమియర్ పర్మిషన్ తో పాటు టికెట్ రేట్లను పెంచుకొనే అవకాశం జీవో పాస్ చేసింది.
తాజాగా తెలంగాణ ప్రభుత్వం కూడా ఓజి చిత్ర టికెట్ రేట్లు పెంచుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నెల 24 వ తేదీ రాత్రి 9 గంటలకు ఓజీ ప్రీమియర్ షోకు అనుమతిని ఇస్తూ జీవో విడుదల చేసింది. ప్రీమియర్ టికెట్ ధర జీఎస్టీతో కలిపి రూ. 800 గా తెలిపింది. అంతేకాకుండా సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 4 వరకు టికెట్ ధరను పెంచుకొనే అవకాశం కల్పించింది. నైజాంలో పదిరోజుల పాటు ఈ చిత్ర టికెట్ రేట్లు సింగిల్ స్క్రీన్స్‌కు రూ.100/-, మల్టీప్లెక్స్‌లకు రూ.150/- చొప్పున పెంచుకునేందుకు రేవంత్ సర్కార్ ఓకే చెప్పింది. దీంతో ఫ్యాన్స్ ప్రీమియర్స్ ఉండడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
OG Movie: వాషి యో వాషి.. ఫ్యాన్స్ ను హైప్ తో చంపేస్తారా
Sharwanand: విడిపోయిన శర్వానంద్ దంపతులు.. ?