Telangana Gaddar Film Awards 2024:  తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్..  విన్నర్స్  వీరే 

ABN , Publish Date - Jun 14 , 2025 | 10:27 PM

తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ (Telangana Gaddar Film Awards) వేడుక ఘనంగా జరిగింది.

Gaddar Awards

తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ (Telangana Gaddar Film Awards) వేడుక ఘనంగా జరిగింది. తెలంగాణ ప్రభుత్వం హైటెక్స్ లో గద్దర్ అవార్డుల ప్రదానోత్సవం  అద్భుతంగా నిర్వహించారు. ఈ వేడుకలో సినీ, రాజీకీయ ప్రముఖులు పాల్గొన్నారు.  ఇక  కళారంగంలో అత్యంత ప్రతిభ కనపర్చిన వారికి అవార్డులను అందించారు. అంతేకాకుండా ప్రశంసా పత్రంతో పాటు క్యాష్ ప్రైజ్ ను కూడా అందించారు. 

మణిరత్నం, సుహాసిని, మురళీ మోహన్, జయసుధ, జయప్రద, అల్లు అర్జున్, నందమూరి బాలకృష్ణ, విజయ్ దేవరకొండ, రీతూ వర్మ, నివేదా థామస్, అనన్య నాగళ్ల తదితరులు పాల్గొన్నారు. ఇక గద్దర్ అవార్డ్స్ 2024 విన్నర్స్ గా గెలిచి అవార్డులు అందుకున్నవారు ఎవరెవరంటే.. 

 

 

  • ఉత్తమ స్క్రీన్ ప్లే అవార్డు:  వెంకీ అట్లూరి (లక్కీ భాస్కర్)

     

  • ఉత్తమ గేయ రచయిత అవార్డు: చంద్రబోస్ ( రాజు యాదవ్ )

     

  • ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ అవార్డు: అర్చన రావు,  అజయ్ కుమార్ (కల్కి 2898 AD)

     

  • ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్ అవార్డు: నల్లా శ్రీను ( రజాకార్ )

     

  • ఉత్తమ సినిమాటోగ్రాఫర్ అవార్డు: విశ్వనాధ్ రెడ్డి(గామి)

     

  • ఉత్తమ ఆర్ట్ డైరెక్టర్ అవార్డు : అధ్నితిన్ జిహాన్ చౌదరి( కల్కి 2898 AD)

     

  • ఉత్తమ ఎడిటర్ అవార్డు : నవీన్ నూలి (లక్కీ భాస్కర్) 

     

  • ఉత్తమ కథా రచయిత అవార్డు : శివ పాలమడుగు (మ్యూజిక్ షాప్ మూర్తి )

     

  • ఉత్తమ కొరియోగ్రఫర్  అవార్డు: గణేష్ ఆచార్య (దేవర)

     

  • ఉత్తమ కమెడియన్ అవార్డు:  సత్య , వెన్నెల కిషోర్ (మత్తు వదలరా) 

     

  • ఉత్తమ యాక్షన్ కొరియోగ్రాఫర్ అవార్డు: చంద్రశేఖర్ రాథోడ్ ( గ్యాంగ్ స్టార్ )

     

  • ఉత్తమ ఫిమేల్ ప్లే బ్యాక్ సింగర్ అవార్డు :శ్రేయ ఘోషల్ ( పుష్ప 2 .. సూసేకి సాంగ్ )

     

  • ఉత్తమ మేల్ ప్లే బ్యాక్ సింగర్ అవార్డు : సిద్ శ్రీరామ్ ( ఊరి పేరు భైరవ కోన.. నిజమేనే చెప్తున్నా సాంగ్ )

     

  • ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్ అవార్డు:  భీమ్స్ సిసిరోలియో( రజాకార్ ) 

  • ఉత్తమ ఫిమేల్  సపోర్టింగ్ అవార్డు: శరణ్య ప్రదీప్ ( అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండ్ )

     

  • ఉత్తమ మేల్ సపోర్టింగ్ అవార్డు : SJ సూర్య (సరిపోదా శనివారం)

     

  • ఉత్తమ బాలల చిత్రం  అవార్డు: 35 చిన్న కథ కాదు 

  • ఉత్తమ ప్రజాదరణ చిత్రం  అవార్డు: ఆయ్ 

     

  • ఉత్తమ  ఫ్యూచర్ ఫిల్మ్  అవార్డు: కమిటీ కుర్రాళ్లు 

     

  • ఉత్తమ చైల్డ్ ఆర్టిస్ట్ అవార్డు: అరుణ్ దేవ్( 35 చిన్న కథ కాదు), హారిక(మెర్సీ కిల్లింగ్)

     

  • ఉత్తమ ఫీచర్  ఫిల్మ్ ఆన్ హిస్టరీ అవార్డు: రజాకార్ 

     

  • ఉత్తమ జ్యూరీ  అవార్డు : దుల్కర్ సల్మాన్ ( లక్కీ భాస్కర్)

  • స్పెషల్ జ్యూరీ అవార్డు: పొట్టేలు (అనన్య నాగళ్ల )

  • స్పెషల్ జ్యూరీ అవార్డు: క ( సుజీత్, సందీప్ )

  • స్పెషల్ జ్యూరీ అవార్డు : రాజు యాదవ్ (రాజేష్ కళ్లేపల్లి)

     

  • జ్యూరీ స్పెషల్ మెన్షన్ అవార్డు: ఫరియా అబ్దుల్లా (మత్తు వదలరా ర్యాప్ సాంగ్ )

     

  • ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ డెబ్యూ అవార్డు: కమిటీ కుర్రాళ్లు 

  • ఉత్తమ తృతీయ  ఫీచర్ ఫిల్మ్ అవార్డు: లక్కీ భాస్కర్

  • ఉత్తమ ద్వితీయ  ఫీచర్ ఫిల్మ్ అవార్డు: పొట్టెల్ 

     

  • ఉత్తమ చిత్రం అవార్డు: కల్కి 2898 AD 

  • ఉత్తమ దర్శకుడు అవార్డు: నాగ అశ్విన్ (కల్కి 2898 AD) 

     

  • ఉత్తమ నటి అవార్డు: నివేదా థామస్( 35 చిన్న కథ కాదు)

  • ఉత్తమ నటుడు అవార్డు : అల్లు అర్జున్ (పుష్ప 2)

  • ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డు: నందమూరి బాలకృష్ణ 

  • పైడి జైరాజ్ అవార్డు: మణిరత్నం 

     

  • కాంతారావు ఫిల్మ్ అవార్డు : విజయ్ దేవరకొండ 

     

  • BN రెడ్డి ఫిల్మ్ అవార్డు : సుకుమార్ 

     

  • నాగిరెడ్డి అండ్ చక్రపాణి ఫిల్మ్ అవార్డు: అట్లూరి పూర్ణచంద్రరావు 

     

  • రఘుపతి వెంకయ్య అవార్డు : యండమూరి వీరేంద్ర నాధ్

     

Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా గద్దర్ అవార్డ్ అందుకున్న అల్లు అర్జున్ 


Updated Date - Jun 14 , 2025 | 10:37 PM