Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా గద్దర్ అవార్డ్ అందుకున్న అల్లు అర్జున్ 

ABN , Publish Date - Jun 14 , 2025 | 10:10 PM

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun)  మరో అరుదైన అవార్డును సొంతం చేసుకున్నాడు.

Allu Arjun

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun)  మరో అరుదైన అవార్డును సొంతం చేసుకున్నాడు. ఎన్నో ఏళ్లుగా వాయిదా పడుతున్న గద్దర్ అవార్డ్స్ (Gaddar Awards)ఎట్టకేలకు నేడు ఘనంగా జరిగాయి. హైటెక్స్ లో సీఎం రేవంత్ రెడ్డి ఈ అవార్డుల ప్రదానోత్సవాన్ని ఎంతో ఘనంగా నిర్వహించారు. సినీ, రాజకీయ ప్రముఖులతో గద్దర్ ఈవెంట్ వేదిక కళకళలాడిపోయింది. ఇక కళారంగంలో అత్యంత ప్రతిభ కనపర్చిన వారికి అవార్డులను అందించారు. అంతేకాకుండా ప్రశంసా పత్రంతో పాటు క్యాష్ ప్రైజ్ ను కూడా అందించారు.

 

 ఇక ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో ఉత్తమ చిత్రంగా కల్కి 2898 AD నిలువగా.. ఉత్తమ నటుడు అవార్డును  పుష్ప 2 కి గాను అల్లు అర్జున్ అందుకున్నాడు. ఉత్తమ నటిగా నివేదా థామస్ 35 చిన్న కథ కాదు అనే సినిమాకు అందుకుంది. ఇక కల్కి సినిమాకు గాను ఉత్తమ డైరెక్టర్ గా నాగ అశ్విన్ గద్దర్ అవార్డును అందుకున్నాడు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ.. " అందరికీ నమస్కారం. నాకు ఈ  ప్రతిష్టాత్మకమైన తెలంగాణ గద్దర్ అవార్డును అందించినందుకు సీఎం రేవంత్ రెడ్డి గారికి, కోమిటిరెడ్డి వెంకట రెడ్డి గారికి ధన్యవాదాలు. సుకుమార్ లేనిదే  ఇదంతా జరిగేది కాదు. ఐ లవ్ యూ సుకుమార్. ఈ అవార్డు  నిజంగా సుకుమార్ విజన్. ఈ సినిమా కోసం పనిచేసిన వారందరికీ థ్యాంక్స్.

 Nandamuri Balakrishna: బన్నీ.. స్టెప్ వేద్దాం రా.. ఆట పట్టించిన బాలయ్య

 

స్పెషల్ థ్యాంక్స్ రాజమౌళి గారికి చెప్పాలి. ఆయనే కనుక పుష్ప 1 ను హిందీలో రిలీజ్ చేయమని చెప్పకపోయి ఉంటే ఇదంతా ఉండేది కాదు. మీకు  థ్యాంక్స్ చెప్పడానికి ఇలాంటి వేడుక కోసమే వెతుకుతున్నాను. ఇది నాకు చాలా స్పెషల్ అవార్డ్. ఎందుకంటే పుష్ప 2 గెలిచిన మొదటి అవార్డు ఇది. ఈ అవార్డును నా ఫ్యాన్స్ కు డెడికేట్ చేస్తున్నాను. నన్ను ఇంతలా సపోర్ట్ చేసి, ప్రేమ చూపిస్తున్నందుకు అభిమానులకు థ్యాంక్స్.  ఇలాంటి ఒక కొత్త ఆలోచన చేసినందుకు తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు. ప్రతి ఏడాది ఈ వేడుక జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను" అంటూ ముగించాడు. 

 

Updated Date - Jun 14 , 2025 | 10:10 PM