సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Teja Sajja: మిరాయ్ తరువాత తేజ చేస్తున్న సినిమా ఏంటో తెలుసా

ABN, Publish Date - Sep 15 , 2025 | 06:44 PM

కెరీర్ ను సక్సెస్ ఫుల్ గా ఎలా మలచుకోవాలో కుర్ర హీరో తేజ సజ్జా (Teja Sajja) కు తెలిసినంత ఇంకే కుర్ర హీరోకు తెలియదు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.

Teja Sajja

Teja Sajja: కెరీర్ ను సక్సెస్ ఫుల్ గా ఎలా మలచుకోవాలో కుర్ర హీరో తేజ సజ్జా (Teja Sajja) కు తెలిసినంత ఇంకే కుర్ర హీరోకు తెలియదు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మొదట్లో తడబడినా హనుమాన్ (Hanuman) సినిమాతో అతనికో క్లారిటీ వచ్చింది. అందుకు తగ్గట్టే ఒక్కో సినిమాను ఆచితూచి ఎంచుకొని వరుస విజయాలను అందుకుంటూ వస్తున్నాడు. హనుమాన్ తరువాత మిరాయ్ (Mirai) లాంటి కథను ఎంచుకొని మరో భారీ హిట్ ను అందుకున్నాడు. వరుసగా రెండు పాన్ ఇండియా సినిమాలతో కుర్ర హీరో జోష్ పెంచేశాడు.


మిరాయ్ తరువాత తేజ సినిమా ఏంటి.. ? ప్రస్తుతం అందరి మెదడును తొలుస్తున్న ప్రశ్న ఇదే. అందుతున్న సమాచారం ప్రకారం తేజ సజ్జా.. కొత్త కథల జోలికి పోకుండా తనకు హిట్ ఇచ్చిన సినిమాకే సీక్వెల్ ను పట్టాలెక్కించనున్నాడు. తేజ సజ్జాకు హనుమాన్ కన్నా ముందు జాంబీ రెడ్డి మంచి విజయాన్ని అందించింది. ఈ సినిమాకు ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించాడు. ఇక ఇప్పుడు జాంబీ రెడ్డి 2 ను పట్టాలెక్కించి పనిలో పడ్డారట తేజ - ప్రశాంత్ వర్మ.


మొదటి నుంచి జాంబీ రెడ్డి 2 ను సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు అది మారి.. ఈ సినిమా కూడా పీపుల్ మీడియా చేతికి వచ్చిందని తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కనుంది. మరి ఈ సినిమాతో తేజ విజయ పరంపరను కొనసాగిస్తాడా.. ? లేదా.. ? అనేది చూడాలి.

Teja Sajja: ‘మిరాయ్‌’ సక్సెస్‌తో తేజాకు అక్కడ మార్కెట్‌ పెరిగినట్టే..

Katrina Kaif: తల్లి కాబోతున్న కత్రీనా కైఫ్.. ?

Updated Date - Sep 15 , 2025 | 06:44 PM