Teja Sajja: మళ్ళీ మొదలైన మిరాయి షూటింగ్...
ABN, Publish Date - May 21 , 2025 | 10:26 AM
'హనుమాన్' తర్వాత తేజ సజ్జా చేస్తున్న మరో పాన్ ఇండియా మూవీ 'మిరాయ్'. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా తాజా షెడ్యూల్ ముంబైలో మొదలైంది.
సూపర్ హీరో తేజ సజ్జా (Teja Sajja) పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్ ‘హనుమాన్’ (Hanuman) తర్వాత చేస్తున్న మరో పాన్ ఇండియా మూవీ 'మిరాయ్' (Mirai). యాక్షన్ అడ్వెంచర్ జానర్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కార్తీక్ ఘట్టమనేని (Karthik Ghattamaneni) దర్శకత్వంతో టీజీ విశ్వప్రసాద్ (TG Vishwa Prasad) నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో తేజ సజ్జా సూపర్ యోధగా పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన కొత్త షెడ్యూల్ ముంబయి లోని చారిత్రక గుహల్లో ప్రారంభమైంది. తేజ సజ్జాతో పాటు మరికొందరు ప్రధాన పాత్రధారులు ఈ షెడ్యూల్‌లో పాల్గొంటున్నారు. సినిమాకు సంబంధించిన పనులు షెడ్యూల్ ప్రకారమే జరుగుతున్నాయని, ముందు అనుకున్నట్టు ఆగస్టులో రిలీజ్ సిద్ధమవుతున్నామని మేకర్స్ తెలిపారు. 'మిరాయ్' చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా 8 భాషల్లో, 2డీ, 3డీ ఫార్మాట్లలో గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నారు.
తేజ సజ్జా ఈ చిత్రంలో సూపర్ యోధ పాత్ర కోసం మరోసారి కంప్లీట్ గా మేకోవర్ అయ్యారు. రాకింగ్ స్టార్ మనోజ్ మంచు (Manchu Manoj) విలన్‌గా, రీతికా నాయక్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన తేజ సజ్జా, మనోజ్ మంచు ఫస్ట్ లుక్ పోస్టర్లు, స్పెషల్ గ్లింప్స్ సినిమాపై భారీ అంచనాలను పెంచాయి. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంతో పాటు సినిమాటోగ్రఫీ, స్క్రీన్‌ప్లేను కూడా అందించగా, మణిబాబు కరణం డైలాగ్స్ రాశారు. గౌరహరి (Gowra Hari) సంగీతం అందించగా, నాగేంద్ర తంగల ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల కో-ప్రొడ్యూసర్ కాగా, కృతి ప్రసాద్ క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా, సుజిత్ కుమార్ కొల్లి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు.
Also Read: Theater Movies: ఈ వారం.. దేశ వ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చే సినిమాలివే
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి