Theater Movies: ఈ వారం.. దేశ వ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చే సినిమాలివే
ABN , Publish Date - May 21 , 2025 | 10:05 AM
ఈ శుక్రవారం (మే 23వ తేదీ) ఏకంగా సౌత్, బాలీవుడ్‌ల నుంచి 30 చిత్రాలకు పైగానే ఈ వారం థియేటర్ల బాట పడుతున్నాయి.
మరో పది రోజుల్లో వేసవి సెలవులు ముగియనున్నాయి. జూన్ నుంచి పాఠశాలలు, కళాశాలలు పునః ప్రారంభమయ్యే అవకాశం ఉంది. దీంతో తమ పిల్లలను పాఠశాలలు, కాలేజీల్లో చేర్చే హడావుడిలో తల్లిదండ్రులు నిమగ్నమై ఉన్నారు. ఈ నేపథ్యంలో దర్శక నిర్మాతలు తమ చిత్రాలను ఈ వేసవి సెలవులు ముగియక ముందే విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో ఈ నెల నాలుగో శుక్రవారమైన (మే 23వ తేదీ) ఏకంగా సౌత్, బాలీవుడ్‌ల నుంచి ఓ 30 చిత్రాలకు పైగానే ఈ వారం థియేటర్ల బాట పడుతున్నాయి.
వాటిలో తెలుగు నుంచి ఆరు చిత్రాలు విడుదల కానుండగా అందులో నాలుగు చిన్న బడ్జెట్ స్ట్రెయిట్ తెలుగు సినిమాలతో పాటు విజయ్ సేతుపతి ఏస్, అక్షయ్ కుమార్ కేసరి చాఫ్టర్2 వంటి డబ్బింగ్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.ఇక తమిళంలో విజయ్ సేతుపతి ‘ఏస్’, దివంగత విజయకాంత్ తనయుడు షణ్ముగ పాండియన్ నటించిన ‘పడైతలైవన్’తో పాటు ‘ఆగ మొళి విళిగల్’, ‘మైయల్’, ‘తిరుపూర్ కురువి’, ‘స్కూల్’, సత్యరాజ్ మద్రాస్ మ్యాట్నీ వంటి మొత్తం10 చిత్రాలున్నాయి.
గత రెండు,మూడు వారాల క్రిందట విడుదలైన నాని హిట్3, మోహన్‌లాల్ తుడరుమ్, శ్రీ విష్ణు సింగిల్, తమిళంతో టూరిస్ట్ ఫ్యామిలీ, డీడీ నెక్ట్స్ లెవల్, మామన్ హిందీలో అజయ్ దేవగణ్ రైడ్2 ఇంకా బాక్సాఫీస్ వద్ద స్టడీగా కలెక్షన్లు రాబడుతున్నాయి. ముఖ్యంగా గత వారం వచ్చిన హాలీవుడ్ చిత్రాలు మిషన్ ఇంఫాజిబుల్, ఫైనల్ డెస్టినేషన్ సినిమాలు దేశవ్యాప్తంగా అదిరిపోయే వసూళ్లను రాబడుతూ టాప్ ప్లేస్‌లో నిలిచాయి. దీంతో వచ్చే శుక్రవారం విడుదలయ్యే చిత్రాలకు ప్రేక్షకాదారణ ఎలా ఉంటుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఇదిలాఉంటే అన్ని చిత్రాలు హాలీవుడ్ నుంచి ఒకటి, హిందీ నుంచి 5, మలయాళం నుంచి 7, కన్నడ నుంచి 3 మే23న విడుదల అవుతున్నాయి.
Telugu
Veeraaraju 1991 May 22
Ace
Vaibhavam
Nishabdha Prema
Kesari Chapter 2
Oka Brundavanam
Tamil
Ace
Azadi
Myyal
Vembu
School
Tiruppur Kuruvi
Padai Thalaivan
Aagakadavana
Madras Matinee
Yezhu Kadal Yezhu Malai
Hindi
Kapkapiii
Pune Highway
Kesari Veer
Bhool Chuk Maaf
Shyam Balram
Malayalam
Narivetta
Azadi
Detective Ujjwalan
Moonwalk
United Kingdom of Kerala (UKOK)
Police Day
916 Kunjoottan
Kannada
Kirik
Manku Thimmana Kagga
Kuladalli Keelyavudo
English
Lilo & Stitch