భయపడి అడుగు ఆపకే

ABN, Publish Date - Jun 18 , 2025 | 03:08 AM

నితిన్‌ హీరోగా శ్రీరామ్‌ వేణు దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘తమ్ముడు’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌ రాజు, శిరీష్‌ నిర్మిస్తున్నారు...

భయపడి అడుగు ఆపకే

నితిన్‌ హీరోగా శ్రీరామ్‌ వేణు దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘తమ్ముడు’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌ రాజు, శిరీష్‌ నిర్మిస్తున్నారు. సప్తమి గౌడ కథానాయిక. జులై 4న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది. చిత్రబృందం ప్రచార కార్యక్రమాల్లో వేగం పెంచింది. మంగళవారం చిత్రబృందం ‘ఆగకే అమ్మాడీ... భయపడి అడుగు ఆపకే’ అంటూ సాగే గీతాన్ని విడుదల చేసింది ఈ సందర్భంగా చిత్రబృందం స్పెషల్‌ పోస్టర్‌ను విడుదల చేసింది. లయ వర్ష బొల్లమ్మ కీలకపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అజనీష్‌ లోక్‌నాథ్‌, సినిమాటోగ్రఫీ: కేవీ గుహన్‌

Updated Date - Jun 18 , 2025 | 03:10 AM