సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

శ్రీరామ్‌కు జ్యుడీషియల్‌ కస్టడీ

ABN, Publish Date - Jun 25 , 2025 | 05:20 AM

మాదక ద్రవ్యాల వినియోగం కేసులో అరెస్టయిన తమిళ నటుడు శ్రీరామ్‌ (శ్రీకాంత్‌)పై పోలీసులు నాలుగు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. మాదక ద్రవ్యాల కేసులో అరెస్టయిన...

మాదక ద్రవ్యాల వినియోగం కేసులో అరెస్టయిన తమిళ నటుడు శ్రీరామ్‌ (శ్రీకాంత్‌)పై పోలీసులు నాలుగు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. మాదక ద్రవ్యాల కేసులో అరెస్టయిన అన్నాడీఎంకే ఐటీ విభాగం ఇన్‌చార్జి ప్రసాద్‌, సేలంలోని మాదక ద్రవ్యాల వ్యాపారి ప్రదీ్‌పకుమార్‌ వాంగ్మూలం ప్రకారం శ్రీరామ్‌ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. మాదకద్రవ్యాల నిరోధక విభాగం పోలీసుల విచారణలో తొలుత శ్రీరామ్‌ తానెలాంటి డ్రగ్స్‌ కొనలేదని, మాదక ద్రవ్యాల ముఠాతో ఎలాంటి సంబంధాలు లేవని చెప్పారు. అయితే మాదక ద్రవ్యాల వ్యాపారికి జీపే ద్వారా నగదు బదిలీకి సంబంధించి ఆధారాలను పోలీసులు చూపించడంతో ఖంగుతిన్నట్లు సమాచారం. సోమవారం రాత్రి శ్రీరామ్‌ను ఎగ్మూరు 14వ జ్యుడీషియల్‌ కోర్టులో హాజరుపరచగా, జూలై 7 వరకు పోలీసు కస్టడీకి పంపుతూ మేజిస్ట్రేట్‌ దయాళన్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

చెన్నై (ఆంధ్రజ్యోతి)

Updated Date - Jun 25 , 2025 | 05:22 AM