Tamannaah Bhatia: శరీరాకృతి ఎప్పుడూ ఒకేలా ఉండదు..
ABN, Publish Date - Nov 11 , 2025 | 12:19 PM
కొందరు కథానాయిక పాత్ర కోసం, పాత్రలో పర్ఫెక్షన్ కోసం ఏదైనా చేయడానికి సాహసిస్తారు. పాత్రానుసారంగా బరువు పెరుగుతారు.. కావాలంటే జీరో సైజ్‌కు కూడా తగ్గింపోతుంటారు.
కొందరు కథానాయిక పాత్ర కోసం, పాత్రలో పర్ఫెక్షన్ కోసం ఏదైనా చేయడానికి సాహసిస్తారు. పాత్రానుసారంగా బరువు పెరుగుతారు.. కావాలంటే జీరో సైజ్‌కు కూడా తగ్గింపోతుంటారు. కొందరు వీటికి వ్యాయమాలు, డైట్‌తో చేస్తుంటారు. మరికొందరు ఇంజెక్షన్లు లాంటివి వాడుతుంటారని వింటుంటాం. ఈ తరహా రూమర్లు చాలానే వస్తుంటాయి. తాజాగా నటి తమన్నాకు (Tamannaah Bhatia) ఇలాంటి పరిస్థితే ఎదురైంది. అయితే వృత్తిరీత్యా కాకుండా వ్యక్తిగత ఆలోచనతో ఆమె బరువు తగ్గేందుకు ఒజెంపిక్ లాంటి ఇంజెక్షన్లు వాడుతున్నారంటూ నెట్టింట వార్తలు వైరల్ అయ్యాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో దీని ప్రస్తావన రాగా, తమన్నా స్పందించారు.
‘నేను 15 ఏళ్ల వయసులో సినిమాల్లోకి వచ్చాను. అప్పటి నుంచి నిరంతరంగా సినిమాలు చేస్తూనే ఉన్నా. కెమెరాతో ట్రావెల్ చేస్తూనే ఉన్నా. ఇక్కడ నేను దాచడానికి ఏం లేదు. సినిమాలోకి రాకముందు, వచ్చాక కూడా స్లిమ్‌గా ఉన్నా. ఇప్పుడూ అలాగే ఉన్నాను. నాకు నేను కొత్తగా కనిపించడం లేదు. మామూలుగా మహిళల్లో ప్రతి ఐదేళ్లకు మార్పులు చోటుచేసుకుంటుంటాయి. కనుక ఎప్పుడూ ఒకే శరీరాకృతితో కనిపించలేం’ అంటూ రూమర్స్‌కు ఫుల్స్టాప్ పెట్టారు.
తెలుగులో ‘ఓదెల2’ చిత్రం తర్వాత మరో తెలుగు సినిమాకు సైన్ చేయలేదు తమన్నా. ప్రస్తుతం ఆమె దృష్టి అంతా బాలీవుడ్‌పైనే ఉంది. అక్కడ ఓ రోమియో, రేంజర్, రోహిత్ శెట్టితో ఓ సినిమా, వివన్, రాగిని ఎంఎంఎస్3, తమిళంలో సుందర్ సి దర్శకత్వంలో విశాల్‌తో ఓ సినిమాతో బిజీగా ఉంది.