Swayambhu: చరిత్రలో చెప్పని ఓ గొప్ప వీరుడి కథ..

ABN , Publish Date - Nov 24 , 2025 | 11:43 AM

మన దేశ చరిత్రకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి, అవి ఒట్టి రాజుల కథలో, యుద్ద కథలో కాదు, మన సంస్కృతికి పునాదులు. ఆ చరిత్రలో చెప్పని ఓ గొప్ప వీరుడి కథే స్వయంభు’

Swayambhu

‘మన దేశ చరిత్రకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి, అవి ఒట్టి రాజుల కథలో, యుద్ద కథలో కాదు, మన సంస్కృతికి పునాదులు. ఆ చరిత్రలో చెప్పని ఓ గొప్ప వీరుడి కథే స్వయంభు’ (Rise Of Swayambhu) అంటున్నారు నిఖిల్‌ (Nikhil) . ఆయన హీరోగా భరత్‌ కృష్ణమాచారి (bharat krishnamachari) దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘స్వయంభు’. పిక్సల్‌ స్టూడియోస్‌ పతాకంపై భువన్‌, శ్రీకర్‌ నిర్మిస్తున్నారు. ఠాగూర్‌ మధు సమర్పకుడు. రెండేళ్లగా ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. ఇప్పుడు సినిమా పూర్తయింది. ఈ విషయాన్ని చెబుతూ ‘రైజ్‌ ఆఫ్‌ స్వయంభు’ పేరుతో ఓ వీడియో విడుదల చేసి, సినిమా రిలీజ్‌ డేట్‌ను ప్రకటించారు. మహాశివరాత్రి సందర్భంగా వచ్చే ఏడాది ఫిబ్రవరి 13 పాన్‌ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ఈ వీడియోలో పేర్కొన్నారు. హిస్టారికల్‌ యాక్షన్‌ ఎపిక్‌గా ఈ సినిమా రూపొందుతున్న ఈ సినిమాలో సంయుక్త, నభా నటేశ్‌ కథానాయికలు.

‘ఒక సినిమా రెండేళ్ల కష్టం.. పదుల సంఖ్యలో సెట్లు.. అదొక సామ్రాజ్యం.. వేల కొద్దీ సవాళ్లు.. అదొక యద్ధం, లక్షల మంది ప్రేక్షకులు, మాకున్న ఒకే ఒక లక్ష్యం కోట్ల పెట్టుబడి.. మా నిర్మాతలు భువన్‌ శ్రీకర్‌ల నమ్మకం.. ఇదే స్వయంభు. మన దేశ చర్రితకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి, అవి ఒట్టి రాజుల కథలో, యుద్ద కథలో కాదు, అవి మన సంస్కృతికి పునాదులు. ఆ చరిత్రలో చెప్పని ఓ గొప్ప వీరుడి కథే స్వయంభు’ అంటూ నిఖిల్‌ వాయిస్‌తో సినిమా ప్రత్యేకతలు, టెక్నీషియన్ల కృషి గురించి వీడియోలో వివరించారు.

Updated Date - Nov 24 , 2025 | 12:19 PM