They Call Him OG: సువ్వి సువ్వి సువ్వాలా.. వీడియో సాంగ్ వచ్చేసింది
ABN, Publish Date - Oct 10 , 2025 | 04:30 PM
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఓజీ (OG).
They Call Him OG: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఓజీ (OG). డీవీవీ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య నిర్మించాడు. ఇక ఈ చిత్రంలో ఇమ్రాన్ హష్మీ విలన్ గా నటించగా.. ప్రకాష్ రాజ్, శ్రేయ రెడ్డి, అర్జున్ దాస్ కీలక పాత్రల్లో నటించారు. ఎన్నో అంచనాల నడుమ సెప్టెంబర్ 25 న ఓజీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అభిమానులు ఆశించనట్లుగానే ఓజీ భారీ విజయాన్ని అందుకుంది.
పవన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ను అందుకుంది. రూ. 300 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి ఇండస్ట్రీని షేక్ చేసింది. పవన్ అభిమానులు ఆయనను ఎలా చూడాలనుకున్నారో సుజీత్ అలానే చూపించి వారి ఆకలి తీర్చాడు. ఓజాస్ గంభీరగా పవన్ అదరగొట్టేశాడు. ఇంకా ఓజీ థియేటర్ లో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది.
తాజాగా ఈ సినిమాలోని ఒక్కో వీడియో సాంగ్ ను రిలీజ్ చేస్తూ మేకర్స్ అభిమానులను అలరించడానికి సిద్ధమయ్యారు. అందులో భాగంగా మొదటగా ఓజీలోని రొమాంటిక్ లవ్ సాంగ్ సువ్వి సువ్వాలాను రిలీజ్ చేశారు. సినిమా మొత్తం ఒక ఎత్తు అయితే.. ప్రియాంక మోహన్ ఉన్నంతసేపు మరో ఎత్తు అని చెప్పుకోవచ్చు. కన్మణిగా ఆమె ఆ పాత్రలో అదరగొట్టేసింది.
ఇక ఈ వీడియో సాంగ్ లో పవన్ వింటేజ్ లుక్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ఎంతో ప్లజెంట్ గా.. లవ్ మోడ్ లో ఎంతో అందంగా కనిపిస్తాడు. వీరిద్దరి జోడి మంచి ప్రశంసలను అందుకుంది. కళ్యాణ్ చక్రవర్తి అందించిన లిరిక్స్ ను శృతి రంజని తన అద్భుతమైన గొంతుతో మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం ఈ సాంగ్ నెట్టింట వైరల్ గా మారింది.
Tollywood: పెద్దలకు మాత్రమే 'ఎర్రచీర'
Ari Movie Review: అరి మూవీ రివ్యూ