సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Suspense Thriller Trishankini: ఉత్కంఠభరిత త్రిశంకిణి

ABN, Publish Date - Aug 23 , 2025 | 04:39 AM

రంజిత్‌ కుమార్‌ ప్రధాన పాత్రలో నటిస్తూ దర్శకత్వం వహిస్తోన్న సినిమా త్రిశంకిణి. ఎన్‌బీజే ప్రొడక్షన్స్‌ బేనర్‌పై ఎన్‌.బిక్కునాథ్‌ ..

రంజిత్‌ కుమార్‌ ప్రధాన పాత్రలో నటిస్తూ దర్శకత్వం వహిస్తోన్న సినిమా ‘త్రిశంకిణి’. ఎన్‌బీజే ప్రొడక్షన్స్‌ బేనర్‌పై ఎన్‌.బిక్కునాథ్‌ నాయక్‌ నిర్మిస్తున్నారు. పలువురు నూతన నటీనటులు ఈ చిత్రంలో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. శుక్రవారం ఈ సినిమా టైటిల్‌ లాంచ్‌ కార్యక్రమాన్ని మేకర్స్‌ నిర్వహించారు. అతిథిగా పాల్గొన్న హాస్య నటుడు బాబు మోహన్‌ మాట్లాడుతూ ‘మెగాస్టార్‌ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ‘త్రిశంకిణి’ టైటిల్‌ని ఆవిష్కరించుకోవడం ఆనందంగా ఉంది. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా’ అని అన్నారు. నిర్మాత బిక్కునాథ్‌ నాయక్‌ మాట్లాడుతూ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ జానర్‌లో ఓ సరికొత్త మూవీ చేశాం. మీరంతా సపోర్ట్‌ చేయాలని కోరుకుంటున్నా’ అని అన్నారు.

Updated Date - Aug 23 , 2025 | 04:39 AM