Suriya: రవితేజ గురించి.. నాకన్నా ఎక్కువగా జ్యోతిక, కార్తీలు మాట్లాడుతారు
ABN , Publish Date - Oct 29 , 2025 | 08:40 AM
కోలీవుడ్ స్టార్ సూర్య, టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజపై ప్రశంసల జల్లు కురిపించారు. When it comes to Ravi Teja Jyothika and Karthi talk about him more than I do says Suriya at mass jathara event
భాను భోగవరపు (Bhanu Bhogavarapu) దర్శకత్వంలో రవితేజ (Ravi Teja), శ్రీలీల (Srileela) జంటగా నటించిన ఈ చిత్రం ‘మాస్ జాతర’ (Mass Jathara). సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయిక్తంగా నిర్మించిన ఈ సినిమా అక్టోబర్ 31న సాయంత్రం షోలతో ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించగా స్టార్ హీరో సూర్య (Suriya) ముఖ్య అతిథిగా విచ్చేశాడు. అనుకోని విధంగా ప్రజల నుంచి సూర్యకు అంతకుమించి అనేలా ఆదరణ వచ్చింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రవితేజపై ప్రశంసల జల్లు కురిపించారు. తాను రవితేజ అభిమానినని చెబుతూ, ఆయన ఎనర్జీ, కామెడీ టైమింగ్ అద్భుతమని ఆయన నిజమైన ఎంటర్‌టైనర్ అని కొనియాడారు.
ఈ వేడుకలో సూర్య మాట్లాడుతూ.. రవితేజ పేరు వినగానే నవ్వు, ఎనర్జీ గుర్తొస్తుంది. నాకన్నా జ్యోతిక, కార్తీ ఇంకా ఎక్కువగా రవితేజ గురించి మాట్లాడగలరు. ఆయన ఉత్సాహం, ఎనర్జీకి రూపం ఆయనే. సగటు మనిషిని తెరపై కింగ్‌సైజ్‌గా చూపించే శక్తి ఆయనకు ఉంది. నటనలో స్థానికత, సంస్కృతి ఉట్టిపడతాయి. రజనీకాంత్, అమితాబ్ బచ్చన్‌ల మాదిరి ఎనర్జీ ఆయనలో ఉంది. కామెడీ, మాస్ పండించడం చాలా కష్టం, కానీ రవితేజ దాన్ని సులభంగా చేస్తారు. ఆయన చేసిన ‘ఇడియట్’, ‘కిక్’, ‘విక్రమార్కుడు’ సినిమాలు తమిళంలోనూ ఘన విజయం సాధించాయి. ముఖ్యంగా ‘విక్రమార్కుడు’ రీమేక్‌గా వచ్చిన ‘సిరుత్తై’ నా తమ్ముడు కార్తి కెరీర్‌కి మలుపు తిప్పింది. అన్నారు.
అనంతరం రవితేజ మాట్లాడుతూ..సూర్య అంటే నాకు చాలా ఇష్టం. ఆయనను చాలా ఏళ్ల తర్వాత కలవడం చాలా ఆనందంగా ఉంది మాములుగా కార్తి, నేను ఎక్కువగా కలుస్తుంటాం ఇకపై సూర్యను కూగా కలుస్తూనే అని అన్నారు. ఇక ఆయన ఏమిటనేది నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ వేడుకకి గెస్ట్‌గా వచ్చినందుకు ఆనందంగా ఉందని అన్నారు. దర్శకుడు భాను భోగవరపు మాస్ డైరెక్టర్ మాత్రమే కాదు, ఆయన దగ్గర ఇంకా ఎన్నో కొత్త కథలు ఉన్నాయి. సంగీత దర్శకుడు భీమ్స్ ఇచ్చిన పాటలు థియేటర్‌లో ప్రేక్షకులను ఊర్రూతలూగిస్తాయి. శివుడు పాత్రలో నవీన్ చంద్ర అద్భుతంగా చేశారు. రాజేంద్రప్రసాద్ గారితో చేసిన సన్నివేశాలు చాలా బాగా వచ్చాయి. శ్రీలీలతో నా కాంబినేషన్ మరోసారి హిట్ అవుతుందన్నారు.
శ్రీలీల మాట్లాడుతూ.. ధమాకాతో ప్రేక్షకులు నన్ను ఒక మెట్టు ఎక్కించారు. ఈ సినిమాతో మరో మెట్టు ఎక్కిస్తారని ఆశిస్తున్నా అని పేర్కొన్నారు. నవీన్‌చంద్ర. మాట్లాడుతూ.. అరవింద సమేత బాల్‌రెడ్డి పాత్ర తర్వాత... ఇందులోని శివుడి పాత్ర కూడా ఎన్నడుమరిచిపోలేని విధంగా ఉంటుందని అన్నారు. నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ.. ప్రేక్షకులు రవితేజ సినిమాల నుంచి ఏం ఆశిస్తారో ఆ ఎలిమెంట్స్ అన్నీ ఇందులో ఉన్నాయి. పక్కా మాస్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో సినిమా పండుగలా ఉంటుంది అని తెలిపారు.
దర్శకుడు భాను భోగవరపు మాట్లాడుతూ.. రవితేజ గారు ఒక విశ్వవిద్యాలయం లాంటి వారు. ఆయన దగ్గర నేర్చుకోవడం నా అదృష్టం. నా దగ్గర ఉన్న అర్హత ఒక్కటే కథ. దాన్ని నమ్మి నాకు అవకాశం ఇచ్చినందుకు రవితేజ గారికి, నిర్మాతలకు కృతజ్ఞతలు. ఈ సినిమా అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉంది అన్నారు. సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో మాట్లాడుతూ.. ధమాకా’ తర్వాత నాకు మళ్లీ రవితేజ గారితో పని చేసే అవకాశం రావడం ఆనందంగా ఉంది. ఆయన ఎప్పుడూ నా వెంటే ఉంటారు. ఈ సినిమా మరోసారి బ్లాక్‌బస్టర్ అవుతుందని అన్నారు.