Suriya: సూర్య ‘కరుప్పు’
ABN, Publish Date - Jun 21 , 2025 | 06:43 AM
తమిళ హీరో సూర్య, దర్శకుడు ఆర్జీ బాలాజీ కాంబినేషన్లో ఓ చిత్రం తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే.
తమిళ హీరో సూర్య, దర్శకుడు ఆర్జీ బాలాజీ కాంబినేషన్లో ఓ చిత్రం తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. సూర్య నటిస్తోన్న 45వ చిత్రమిది. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బేనర్‌పై ఎస్.ఆర్.ప్రకాశ్ బాబు, ఎస్.ఆర్.ప్రభు నిర్మిస్తున్నారు. ఇందులో కథానాయికగా త్రిష నటిస్తుండగా, సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నారు.
శుక్రవారం చిత్ర దర్శకుడు బాలాజీ పుట్టిన రోజు. ఈ సందర్భంగా సినిమా టైటిల్‌ను ‘కరుప్పు’ అని ఖరారు చేస్తూ మేకర్స్ అధికారిక ప్రకటన విడుదల చేశారు. యాక్షన్ అడ్వెంచర్సగా తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. ఈ ఏడాది చివర్లో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు చిత్రబృందం పేర్కొంది.