Sunny Deol New Movie: నటుడిగా నాకు సవాల్ విసిరే పాత్ర
ABN, Publish Date - Aug 17 , 2025 | 05:53 AM
సాయిపల్లవి, రణ్‌బీర్‌కపూర్ సీతారాములుగా నితేశ్ తివారి దర్శకత్వం వహిస్తున్న బాలీవుడ్ చిత్రం ‘రామాయణ.’. సన్నీడియోల్ ఇందులో హనుమంతుడి పాత్రలో...
సాయిపల్లవి, రణ్‌బీర్‌కపూర్ సీతారాములుగా నితేశ్ తివారి దర్శకత్వం వహిస్తున్న బాలీవుడ్ చిత్రం ‘రామాయణ.’. సన్నీడియోల్ ఇందులో హనుమంతుడి పాత్రలో కనిపించనున్నారు. త్వరలో ఆయన పాత్రకు సంబంధించిన చిత్రీకరణ ప్రారంభించబోతున్నారు. ఈ సందర్భంగా సన్నిడియోల్ మాట్లాడుతూ ‘హనుమంతుడి పాత్ర పోషిస్తున్నందుకు ఆనందంతోపాటు భయం కూడా కలుగుతోంది. త్వరలోనే రామాయణ సెట్స్‌లోకి అడుగుపెట్టబోతున్నాను. నటుడిగా నాకు సవాల్ విసిరే పాత్ర ఇది. హనుమంతుని పాత్రలో జీవించాలి. ఈ సినిమాతో ప్రపంచమంతా రామాయణం గొప్పదనాన్ని మరోసారి తెలుసుకుంటుంది’ అని చెప్పారు.