సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Nara Rohith: ప్రేక్షకులను మెప్పిస్తోంది

ABN, Publish Date - Aug 30 , 2025 | 04:07 AM

సుందరకాండ సినిమాకి వస్తున్న స్పందన చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. కుటుంబ ప్రేక్షకులు మా చిత్రాన్ని అమితంగా..

‘‘సుందరకాండ’ సినిమాకి వస్తున్న స్పందన చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. కుటుంబ ప్రేక్షకులు మా చిత్రాన్ని అమితంగా ఆదరిస్తున్నారు’ అని అన్నారు హీరో నారా రోహిత్‌. ఆయన కథానాయకుడిగా వెంకటేశ్‌ నిమ్మలపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘సుందరకాండ’ చిత్రం ఇటీవలె విడుదలైన సందర్భంగా చిత్రబృందం సక్సెస్‌ మీట్‌ నిర్వహించింది. ఈ సందర్భంగా నారా రోహిత్‌ మాట్లాడుతూ ‘సినిమాలో సత్య పాత్రను ప్రేక్షకులు చాలా ఎంజాయ్‌ చేస్తున్నారు. వెంకీ రాసిన డైలాగ్స్‌ గురించి చాలా మంది ప్రత్యేకంగా చెప్పారు’ అని అన్నారు. వెంకటేశ్‌ నిమ్మలపూడి మాట్లాడుతూ ‘సినిమాను ప్రేక్షకులు ఎంజాయ్‌ చేయడం చాలా అనందంగా అనిపించింది. ఇలాంటి నిర్మాతలు దొరకడం నా అదృష్టం. నారా రోహిత్‌ నన్ను నమ్మి ఉండకపోతే ఈ రోజు మీ ముందు ఇలా ఉండేవాడిని కాదు’ అని అన్నారు.

Updated Date - Aug 30 , 2025 | 04:07 AM