Sumanth: అది ఇప్పటి ఫోటో కాదు.. ఆ వార్తల్లో నిజం లేదు..
ABN, Publish Date - May 11 , 2025 | 02:53 PM
నటుడు సుమంత్ (sumanth), నటి మృణాల్ ఠాకూర్9Mrunal Thakur) వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారంటూ ఇటీవల సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. వీరిద్దరూ కలిసి దిగిన ఓ ఫొటో కూడా నెట్టింట వైరల్‌గా అయింది.
నటుడు సుమంత్ (sumanth), నటి మృణాల్ ఠాకూర్9Mrunal Thakur) వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారంటూ ఇటీవల సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. వీరిద్దరూ కలిసి దిగిన ఓ ఫొటో కూడా నెట్టింట వైరల్‌గా అయింది. దీనిపై సుమంత్ క్లారిటీ ఇచ్చారు. తన తదుపరి చిత్రం ‘అనగనగా’ (Anaganaga) ప్రమోషన్స్‌లో పెళ్లి వార్తలపై స్పందించారు. ఆ వార్తల్లో నిజం లేదని చెప్పారు. ుూసోషల్‌మీడియానుపెద్దగా ఉపయోగించను. అందుకే ఈ వార్తలు తన దృష్టికి రాలేదు. ఇంటర్‌నెట్‌లో వైరల్ అవుతున్న ఫొటో ‘సీతారామం’ ప్రమోషన్స్ సమయంలో తీసుకున్నాం. అది ఇప్పుడు బయటకు వచ్చి వైరల్ అయింది. మరోసారి వైవాహిక బంధం లోకి అడుగు పెట్టే ఉద్దేశం లేదు’’ అని అన్నారు. సుమంత్‌కు గతంలో కీర్తిరెడ్డిని పెళ్లి చేసుకున్నారు. కొంతకాలానికే వీరిద్దరూ విడిపోయారు.
సుమంత్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘అనగనగా’. ఓటీటీలో విడుదల కానుంది. కాజల్ చౌదరి హీరోయిన్. సన్నీ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో సుమంత్ ఉపాధ్యాయుడిగా నటించారు. నేటి విద్యా వ్యవస్థ లోని లోపాలను ఎత్తి చూపడం తో పాటు చిన్నారులకు ఏ విధంగా పాఠాలు బోధిస్తే త్వరగా అర్థమవుతుందో చెప్పే ప్రయత్నం చేసినట్టు టీజర్ చూేస్త అర్థమవుతోంది. మార్కుల కోసం పిల్లల?పై ఒత్తిడి పెంచకూడదని.. కాన్సెప్టు నేర్చుకుంటే చాలు మార్కులు వాటంతటవే వస్తాయనేది ఆ ఉపాధ్యాయుడి నమ్మకం. మరి, ఆయన ప్రయత్నం ఫలించిందా? తదితర అంశాలతో ఈ చిత్రం తెరకెక్కింది.