సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Pawan - Suman: ఇంట్రెస్టింగ్ సజెషన్ - ఏపీలో మార్షల్ ఆర్ట్స్ స్కూల్స్

ABN, Publish Date - Sep 15 , 2025 | 07:48 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లో చాలా స్కిల్స్ ఉన్నాయి. రైటర్ గా, డైరెక్టర్ గా, కొరియోగ్రాఫర్ గా, సింగర్ గా తన టాలెంట్ ని చాలాసార్లు బయటపెట్టాడు.‌ అయితే ఇప్పుడు ఆయనలోని టాలెంట్ గురించి ఇంట్రెస్టింగ్ డిస్కషన్ తెరపైకి వచ్చింది.

పవర్‌స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) బ్లాక్ బెల్ట్ హోల్డర్ అని అందరికీ తెలుసు. గతంలో ఎన్నో సినిమాల్లో తన మార్షల్ ఆర్ట్స్ (martial arts) స్కిల్స్‌తో ఫ్యాన్స్‌ని ఫిదా చేశాడు. ఇప్పుడు మరోసారి త్వరలో రిలీజ్ కాబోతున్న గ్యాంగ్‌స్టర్ డ్రామా ‘ఓజీ’ (OG)లో పవన్ తన కిక్స్ తో, పంచ్‌లతో స్క్రీన్‌పై సందడి చేయబోతున్నాడు. ఈ విషయం తెలిసి ఫ్యాన్స్ ఇప్పటికే ఈ మూవీ మీద ఎంతో హోప్స్ పెట్టుకున్నారు. అయితే మార్షల్ ఆర్ట్స్ విషయంలో పవర్ స్టార్ కు మరో సినీ యాక్టర్ నుంచి ఓ స్పెషల్ రిక్వెస్ట్ రావడం చర్చనీయాంశంగా మారింది.

సీనియర్ యాక్టర్ సుమన్ (Suman) పవర్ స్టార్ కు ఓ ఇంట్రెస్టింగ్ సజెషన్ ఇచ్చాడు. సుమన్ కూడా కరాటేలో బ్లాక్ బెల్ట్ హోల్డర్. ఈ క్రమంలో ఆయన పవర్ స్టార్ కు మంచి సలహా ఇచ్చాడు. పవన్ మార్షల్ ఆర్ట్స్‌లో గురువు అని, ఆయన ఆంధ్రప్రదేశ్ స్కూళ్లలో మార్షల్ ఆర్ట్స్‌ని పాఠ్యాంశంలో చేర్చితే స్టూడెంట్స్‌కి ఎంతో ఉపయోగపడుతుందని చెప్పాడు‌‌. అంతే కాదు తాను ఈ ఆర్ట్‌ని ప్రమోట్ చేయడానికి ఫుల్ సపోర్ట్ ఇస్తా అంటూ విశాఖలోని పాడేరులో జరిగిన కరాటే ట్రైనింగ్ అకాడమీ ఈవెంట్‌లో చెప్పాడు. గిరిజన స్టూడెంట్స్‌ (Girijan students) కి కరాటే, జూడో వంటి మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ ఇస్తున్న ప్రయత్నాలకు సుమన్ ఫుల్ సపోర్ట్ చేస్తున్నాడు.

సినిమాల విషయానికి వస్తే సుమన్ చివరిగా, 2023లో నితిన్‌తో ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ (Extra Ordinary Man) లో కనిపించాడు. సినిమాలతో బిజీగా ఉన్నప్పటికి ఆయనకు కరెంట్ ఎఫైర్లపై మంచి అవగాహన ఉంది. దానితోనే పవన్ గురించి తన మనసులోని మాటను బయటపెట్టాడు. మరి ఇప్పుడు పవన్, సుమన్ కాంబోలో స్కూళ్లలో మార్షల్ ఆర్ట్స్ లేదా మార్షల్ ఆర్ట్స్ స్కూల్స్ ఏర్పాటు అవుతాయో లేదా చూడాలి.

Updated Date - Sep 15 , 2025 | 07:51 PM