Peddi: శిష్యుడు సినిమాకు గురువు గారి సలహాలు.. పనికొచ్చేనా
ABN , Publish Date - Oct 28 , 2025 | 08:32 PM
ఎంత పెద్ద సినిమా నిర్మించినా ప్రేక్షకులను అలరించాలనే. ఏ గురువు అయినా శిష్యుడు ఎదగాలనే చూస్తాడు. అలాంటి గురువుల్లో సుకుమార్ (Sukumar) మొట్ట మొదట వరుసలో ఉంటాడు.
Peddi: ఎంత పెద్ద సినిమా నిర్మించినా ప్రేక్షకులను అలరించాలనే. ఏ గురువు అయినా శిష్యుడు ఎదగాలనే చూస్తాడు. అలాంటి గురువుల్లో సుకుమార్ (Sukumar) మొట్ట మొదట వరుసలో ఉంటాడు. ఇప్పటివరకు ఇండస్ట్రీలో సుకుమార్ శిష్యులే ఎక్కువమంది ఉన్నారు. సుకుమార్ సైతం ఏరోజు వారిని ఆపాలని ప్రయత్నించలేదు. ఇంకా వారికి సహాయం చేయాలనీ చూసాడు. ఇప్పుడు పెద్ది విషయంలో కూడా అదే చేస్తున్నాడు.
డైరెక్టర్ సుకుమార్ వద్ద అసోసియేట్ గా పనిచేసిన బుచ్చి బాబు సానా ఉప్పెన సినిమాతో దర్శకునిగా పరిచయం అయ్యారు. ఆ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ తో కలసి సుకుమార్ రైటింగ్స్ కూడా తెరకెక్కించింది. ఆ చిత్రం ఘనవిజయం సాధించింది. ప్రస్తుతం అదే బుచ్చిబాబు సానా డైరెక్షన్ లోనే రామ్ చరణ్ హీరోగా పెద్ది తెరకెక్కుతోంది. ఈ సినిమాతోనూ సుకుమార్ కు సంబంధం ఉంది. మైత్రీ మూవీమేకర్స్ తో కలసి పెద్ది చిత్రాన్ని సుకుమార్ పంపిణీ చేయనున్నారు. ఈ నేపథ్యంలో పెద్ది కోసం సుక్కు ఎంతో శ్రద్ధ వహిస్తున్నారని సమాచారం. పెద్ది పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ను కూడా సుకుమార్ దగ్గరుండి చూసుకుంటూ ఉండడం విశేషంగా మారింది.
సుకుమార్ తన శిష్యుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న పెద్ది సినిమాకు సూచనలు, సలహాలు ఇవ్వడంతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ లోనూ పాలుపంచుకోవడం విశేషంగా మారింది. బుచ్చిబాబు తొలి సినిమా ఉప్పెన కు నిర్మాణ భాగస్వామిగానే ఉన్న సుకుమార్ ఈ సారి పెద్ది కి మేకింగ్ లోనూ చేయిపెట్టడానికి కారణం ఉంది. ఎందుకంటే ఈ సినిమాలో రామ్ చరణ్ హీరో... పైగా పెద్ది సినిమా వచ్చే యేడాది రామ్ చరణ్ బర్త్ డే కానుకగా మార్చి 27న రానుంది. చెర్రీ బర్త్ డేకు వస్తోన్న పెద్ది ఫ్యాన్స్ ను విశేషంగా ఆకట్టుకోవాలనే ఉద్దేశంతోనే సుకుమార్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ లోనూ పాలుపంచుకుంటున్నారని యూనిట్ మాట.
పెద్ది సినిమా కొన్ని విశేషాలతో తెరకెక్కుతోంది. ఈ సినిమాకు ఎ.ఆర్.రహమాన్ సంగీతం సమకూరుస్తున్నారు. వృద్ధి సినిమాస్' బ్యానర్ పై 'పెద్ది' చిత్రాన్ని వెంకట సతీశ్ కిలారు, ఇషాన్ సక్సేనా నిర్మిస్తున్నారు. జాన్వీ కపూర్ నాయికగా నటిస్తోన్న ఈ మూవీపై ఫ్యాన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అందువల్ల డైరెక్టర్ గా బుచ్చిబాబు సానాకు పెద్ది మంచి పేరు తీసుకు రావాలనే సుకుమార్ ఆశించి మరీ ఈ సినిమా మేకింగ్ లో ఇన్వాల్వ్ అయినట్టు సమాచారం.. ఇందులో నిజానిజాలు ఎలా ఉన్నా, బుచ్చిబాబు అభివృద్ధిని కాంక్షించే సుకుమార్ తప్పకుండా పెద్ది విషయంలో సలహాలు, సూచనలు ఇచ్చి ఉంటారని వినిపిస్తోంది. మరి సుక్కు సలహాలు పనికొచ్చేవా లేవా అనేది రిలీజ్ అయ్యాక చూడాలి.
Rajinikanth: రిటైర్మెంట్ ప్రకటించనున్న రజినీ.. అదే ఆఖరి సినిమానా
CM Revanth Reddy: సినిమా టికెట్ ధరలు పెంచితే.. కార్మికులకు ఎం ఒరిగింది? సీఎం హాట్ కామెంట్స్