Sujeeth: అకీరాలో స్పార్క్ ఉంది.. ఇప్పుడే ఏం చెప్పలేను..
ABN, Publish Date - Sep 26 , 2025 | 10:57 AM
పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా తెరకెక్కిన గ్యాంగ్‌స్టర్ సినిమా‘ఓజీ’ (OG). గురువారం ప్రేక్షకుల ముందుకొచ్చి భారీ విజయం సాధించింది. ఈ చిత్రానికి సీక్వెల్ ఉన్నట్లు ఇప్పటికే చిత్ర బృందం ప్రకటించింది.
పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా తెరకెక్కిన గ్యాంగ్‌స్టర్ సినిమా‘ఓజీ’ (OG). గురువారం ప్రేక్షకుల ముందుకొచ్చి భారీ విజయం సాధించింది. ఈ చిత్రానికి సీక్వెల్ ఉన్నట్లు ఇప్పటికే చిత్ర బృందం ప్రకటించింది. తాజా ఇంటర్వ్యూలో దర్శకుడు సుజీత్ ‘ఓజీ 2’ గురించి మాట్లాడారు. ‘ఓజీ-2’ను అకీరా నందన్‌తో (Akira nandan) తీస్తారా అన్న ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. ‘ఓజీ2’ను అకీరాతో తీస్తానా.. లేదా అనే విషయాన్ని మీరు పవన్‌కల్యాణ్‌ను అడగాలి. ప్రస్తుతానికి అందరూ ఓజీ హైప్‌లో ఉన్నారు. దీన్ని అందరూ ఎంజాయ్ చేసిన తర్వాత సీక్వెల్‌కు సంబంధించిన విషయాలు గురించి మాట్లాడతా. ‘ఓజీ’ సెట్స్‌కు అకీరా కూడా వచ్చాడు. తనలో ఓ స్పార్క్ ఉంది. ఇంతకుమించి ఇంకేం చెప్పలేను. ఇప్పుడు నేనేం చెప్పినా అది ఎక్కడికో వెళ్లిపోతుంది. అందుకు ఆ టాపిక్ గురించి ఎక్కువ మాట్లాడను’ అన్నారు. సుజీత్ మాటల్ని బట్టి ఓజీ-2లో తప్పకుండా అకీరా కనిపిస్తాడనే అభిమానులు నమ్ముతున్నారు. సుజీత్ సినిమాటిక్ యూనివర్స్‌ను గురించి ఆయన మాట్లాడారు. ఉద్దేశపూర్వకంగా అలాంటి ఒక యూనివర్స్‌ను సృష్టించాలని నాకు లేదు. సుజీత్ సినిమాటిక్ యూనివర్స్ అనే పేరును మా టీమ్ ప్రకటించింది. ఇది వర్క్‌వుట్ అయితే మంచిదే కదా. ఇప్పుడు దానికి గురించి అంతగా మాట్లాడక్కర్లేదు. నా సినిమాలను యూనివర్స్‌లో కలపాలన్న ఉద్దేశం లేదు. కానీ, ఏదైనా సినిమాలో ఒక పాత్ర తన గురించి చెబుతూ నేను గతంలో ‘ఓజీ’ దగ్గర పని చేశాను అంటే.. దాన్ని ఈ యూనివర్స్‌లో కలిపేస్తారు. అప్పుడు ప్రేక్షకులంతా ఎంజాయ్ చేస్తారు’ అని సుజీత్ అన్నారు.