Suhas: 'మండాడి' సుహాస్ ఫస్ట్ లుక్
ABN, Publish Date - Aug 19 , 2025 | 02:33 PM
సుహాస్ నెగటివ్ రోల్ చేస్తున్న చిత్రం ‘మండాడి’. మంగళవారం సుహాస్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం లుక్ విడుదల చేశారు.
ఆర్‌ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ 16వ ప్రాజెక్ట్‌గా వస్తున్న హై-ఆక్టేన్ ఎంటర్టైనర్ ‘మండాడి’ (Mandadi). ‘సెల్ఫీ’ ఫేమ్ మతి మారన్ పుగళేంది దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సూరి(Soori), సుహాస్ (Suhas) కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇంటెన్స్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ఒక ల్యాండ్‌మార్క్ చిత్రంగా రూపుదిద్దుకుంటోంది. సుహాస్ మొదటిసారిగా విలన్ పాత్రను పోషిస్తున్నారు. మంగళవారం అతని పుట్టినరోజు సందర్భంగా ‘మండాడి’టీం శుభాకాంక్షలు చెబుతూ ఫస్ట్ లుక్ విడుదల చేసారు. ఇందులో సూరి, సుహాస్‌లతో పాటు మహిమా నంబియార్ కీలక పాత్రను పోషిస్తున్నారు.
క్రీడ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మనుగడ, వ్యక్తిగత గుర్తింపు, అజేయమైన మానవ స్ఫూర్తి వంటి అంశాలు కీలకంగా చెప్పబోతున్నారు. సత్యరాజ్, రవీంద్ర విజయ్, అచ్యుత్ కుమార్ ఇతర పాత్రలను పోషిస్తున్నారు. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం సమకూరుస్తున్నారు. ఎస్.ఆర్. కతిర్ ఐ.ఎస్.సి సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు. పీటర్ హెయిన్ యాక్షన్ సన్నివేశాలను కంపోజ్ చేస్తున్నారు. . నిర్మాతలు త్వరలో సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు.