Oh Bhama Ayyo Rama: జూలై 11న థియేటర్లలోకి.. సుహాస్ ఓ భామ అయ్యో రామ
ABN, Publish Date - Jun 17 , 2025 | 06:33 PM
సుహాస్, మాళవిక మనోజ్ జంటగా నటించిన చిత్రం ఓ భామ అయ్యో రామ విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు.
సినిమా సినిమాకు డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ దూసుకెళ్తుతున్న కథానాయకుడు సుహాస్ (Suhas) తాజాగా నటిస్తున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ఓ భామ అయ్యో రామ (Oh Bhama Ayyo Rama). మలయాళంలో జో అనే చిత్రంతో అందరి హృదయాలను దోచుకున్న నటి మాళవిక మనోజ్ (Malavika Manoj) (జో ఫేమ్) ఈ చిత్రంతో తెలుగులోకి కథానాయికగా పరిచయమవుతోంది. రామ్ గోధల దర్శకుడు. వీ ఆర్ట్స్ పతాకంపై హరీష్ నల్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రముఖ కథానాయకుడు రానా దగ్గుబాటి (Rana Daggubati) స్పిరిట్ మీడియా ఈ చిత్రాన్ని విడుదల చేయనుంది. ఇటీవల విడుదలైన ఈ చిత్రం టీజర్‌కు, పాటలకు మంచి స్పందన వస్తోంది. తాజాగా ఈ కాగా ఈ చిత్రాన్ని జూలై11న ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ.. ఇదొక బ్యూటిఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్. అన్ని వర్గాలకు కావాల్సిన అంశాలు ఇందులో ఉన్నాయని, ప్రతి ఫేమ్ కలర్‌ఫుల్‌గా ఉంది క్యూట్ అండ్ ఎంటర్‌టైనింగ్ లవ్‌స్టోరీ ఎంటర్‌టైన్‌మెంట్ అందర్ని అలరిస్తుందన్నారు. రామ్‌గా సుహాస్, సత్యభామగా మాళవిక మనోజ్‌లు ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతుందని,. నిర్మాత ఎక్కడా ఖర్చు విషయంలో కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించాడని, ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ అతిథి పాత్రలో నటించాడని అన్నారు.
నిర్మాత మాట్లాడుతూ.. సాధారణంగా లవ్ రొమాంటిక్ కామెడీ సినిమాలను అందరం ఇష్టపడుతుంటాము. ఇప్పుడు అదే తరహాలో సుహాస్ హీరోగా ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం ఓ భామ అయ్యో రామ. అందరిని నవ్వించే వినోదమైన యువకుడి చుట్టూ తిరిగే ఓ కథగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఖర్చు విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించాం. తప్పకుండా ఈ చిత్రం సుహాస్ కెరీర్‌లో మైలురాయిగా నిలుస్తుంది. జూలై 11న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు థియేటర్‌లో ఎంజాయ్ చేస్తారు అన్నారు.